PS2:పొన్నియన్ సెల్వం 2 మూవీ రివ్యూ మీ కోసం

Posted by venditeravaartha, April 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజమౌళి గారి బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం తో సౌత్ లో లో మిగిలిన డైరెక్టర్ లు పాన్ ఇండియన్ సినిమా తీయాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి వారి లో ఉన్న ప్రతిభ తో చాల మంది సక్సెస్ అయ్యారు ,అందులో మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పిలవబడే మణిరత్నం గారు ఒకరు,ఈయన కి ఎంతో ఇష్టమైన ‘పొన్నియన్ సెల్వం ‘ నవలని సినిమా గా తీయాలి అని భారీ బడ్జెట్ తో ,పెద్ద స్టార్ క్యాస్ట్ తో తీసిన మూవీ నే ‘పొన్నియన్ సెల్వం’.గత సంవత్సరం రిలీజ్ అయినా PS1 కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవగా టాలీవుడ్ లో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.మరి ఈ రోజు రిలీజ్ అయినా PS2 ఎలా ఉందొ చూద్దాం !

కథ :పొన్నియన్ సెల్వం మొదటి భాగం లో అందరి క్యారక్టర్ ల ను పరిచయం చేసిన మణిరత్నం,క్లైమాక్స్ లో జయం రవి ,కార్తీ సముద్రం లో మునిగి పోయినట్లు చూపించి పార్ట్ 1 ని ముగించారు ,మొదటి భాగం ఎక్కడ అయితే ముగిసిందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది పార్ట్ 2 ,సముద్రం లో మునిగి పోయిన ‘పొన్నియన్ సెల్వం (జయం రవి )’,’వల్లవరాయ(కార్తీ)’ ల ను ముసలి వేషం లో ఉన్న ఆవిడ కాపాడుతుంది,ఆ కాపాడిన వ్యక్తి ఐశ్వర్యారాయ్ (మందాకినీ )
పొన్నియన్ సెల్వం కనబడుట లేడు అని ఆదిత్య కరికాలుడ్ని (విక్రమ్) ని చౌళ రాజ్యానికి రాజు గా చేస్తారు,అయితే తదనంతరం నందిని(ఐశ్వర్యా రాయ్),పాండ్యులు కలిసి చౌళ రాజ్యాన్ని కూల్చాలని ప్లాన్ చేస్తారు,అయితే చౌళ రాజ్యానికి తిరిగి వచ్చిన పొన్నియన్ సెల్వం,వల్లవరాయ,ఆదిత్య కరికాలుడు కలిసి చౌళ రాజ్యాన్ని రక్షించారా ? లేదా అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ:మొదటి భాగం లో ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారో అర్ధం కానీ వారికి రెండో భాగం లో ఒక క్లారిటీ వస్తుంది,అయితే పొన్నియన్ సెల్వం నవల ని తాను అనుకున్న విధముగా తెరెక్కించడం లో మణిరత్నం సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.ముఖ్యం గా విక్రమ్ ,ఐశ్వర్యరాయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలను చాల అద్భుతం గా చిత్రీకరించారు అనే చెప్పాలి,మిగిలిన నటుల లో జయం రవి ,కార్తీ,త్రిష,ప్రకాష్ రాజ్,శోభిత దూళిపాళ్ల,శరత్ కుమార్ ,పార్తీబన్ ,ఐశ్వర్యలక్ష్మి వారి వారి పాత్రల లో మెప్పించారు.ఏ ఆర్ రెహ్మాన్ గారి మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది.మొదటి భాగం అర్ధం కానీ వారికి ఈ రెండవ భాగం చూసాక ఒక క్లారిటీ వస్తుంది ,మొదటి భాగం నచ్చిన వారికి PS2 సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది.

పాజిటివ్ :స్క్రీన్ ప్లే ,విక్రమ్ ,ఐశ్వర్య రాయ్ ,జయం రవి ,విజువల్ ఎఫెక్ట్స్ ,మ్యూజిక్ .
నెగిటివ్ :స్లో నారేషన్ ,యుద్ధ సన్నివేశాలు,సాగదీయతా తో కూడిన కథ.
రేటింగ్:2 .5 / 5

2858 views