యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే..అందులో ‘ఆది పురుష్’ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది..ఈ సంక్రాంతి కి విడుదల అవ్వాల్సిన ఆ సినిమా VFX గ్రాఫిక్స్ వర్క్ మొత్తం మీద మరోసారి పని చేసి బెస్ట్ ఔట్పుట్ ఇవ్వడానికి కోసం జులై నెలకి వాయిదా వేశారు. మరో పక్క ప్రశాంత్ నీల్ లో ‘సలార్’ , నాగ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ K’ మరియు డైరెక్టర్ మారుతితో ‘రాజా డీలక్స్’ వంటి సినిమాలు చేస్తున్నాడు..ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి..ఒక సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా నెల రోజులు చేస్తేనే ఊపిరి ఆడనంత పని అవుతుంది, అలాంటిది మూడు సినిమాలు ఒకే సమయం లో చెయ్యడం అంటే ఒక మనిషి మానసిక స్థితి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ప్రభాస్ పరిస్థితి కూడా అదే..మితిమీరి కష్టపడడం తో ఆయనకీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయట.రీసెంట్ గా సలార్ మూవీ సెట్స్ లో బాడీలో వేడి విపరీతంగా పెరిగిపోయి అక్కడిక్కక్కడే సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడట.ఆ తర్వాత వెంటనే ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చెయ్యగా , ప్రభాస్ కి అర్జెంటు గా విశ్రాంతి కావాలని, షూటింగ్స్ లో కొంతకాలం పాల్గొనకుండా ఉంటేనే అతని ఆరోగ్యం కి శ్రేయస్కరం అని చెప్పడం తో ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఆ మూడు సినిమాల షూటింగ్స్ ని ఆపేసారు.ప్రభాస్ పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు షూటింగ్స్ లో పాల్గొనడట.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలలో ఈ ఏడాది రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకటి ఆది పురుష్ కాగా, మరొకటి సలార్.ఈ రెండు సినిమాలలో సలార్ మీద అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.