OG Movie : ఎట్టకేలకు ఓజీ మూవీ రిలీజ్ డేట్ పై వచ్చిన క్లారిటీ.. మరో 15రోజులిస్తే చాలు

Posted by RR writings, February 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


OG Movie : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. పార్టీని నడిపించేందుకు యాడ్స్ చేస్తున్నాడని.. ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ఎలక్షన్స్ తర్వాత ఓజీ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు కంటే ఓజీ షూటింగ్ ఎక్కువ జరిగింది.

ఈ సినిమాకు పవర్ స్టార్ జస్ట్ 15 నుంచి 20 రోజులు డేట్స్ ఇస్తేనే షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. అయితే.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఓజీ సినిమాకు కేవలం 15 రోజుల డేట్స్ మాత్రమే ఇస్తానని పవన్ చెప్పాడట. ఈ 15 రోజుల్లో తన పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని సుజీత్‌కి డెడ్‌లైన్ ఇచ్చాడు. డైరెక్టర్ సుజీత్‌కి మాత్రం ఇది అతిపెద్ద సవాలనే చెప్పాలి. అయితే పవర్ స్టార్ ఈ 15 రోజుల డేట్స్ ఎప్పుడు ఇస్తాడో ఎవరికీ క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల తర్వాత ఓజీ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 27న ఓజీ చిత్రాన్ని విడుదల చేస్తామని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో సుజీత్.. అదే డేట్ టార్గెట్‌లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలి. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సుజీత్ ఓజీని సమయానికి థియేటర్‌కి తీసుకువస్తాడా? మరి పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో చూడాలి.

243 views