Pawan – lavanya: వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఆరేళ్ల తమ ప్రేమను ఇటలీలోని టస్కానీ వేదికగా పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ ఎన్నో ప్రత్యేకలతో సాగింది. ఈ సందర్భంలో మెగా బ్రదర్స్, అక్క చెల్లెళ్లందరి గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ -అన్నా లెజెనోవా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
గ్రూప్ ఫోటోలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి -సురేఖ, నాగబాబు-పద్మజ, పవన్ కళ్యాణ్ -అన్నా లెజెనోవా అలాగే మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి వారి భర్తలతో ఉన్న గ్రూపు ఫోటో తెగ వైరల్ అవుతోంది. అప్పటి వరకు పవన్ పెళ్లి హాజరవుతాడా లేదా అన్న సందేహం మెగా అభిమానుల్లో నెలకొంది. వాటిని పటా పంచలు చేస్తూ ఫ్యామిలీతో వరుణ్ పెళ్లికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాడు.
పెళ్లిలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి చాలామంది ఏదేదో మాట్లాడారు. అవన్నీ పటాపంచలు చెయ్యడానికి కూడా ఈ ఒక్క ఫోటో చాలంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయమేంటని ఓ అభిమాని లావణ్యని అడగ్గా, ‘పవన్ ప్రజల మనిషి’ అని.. ఆయనంటే ఇష్టమని సమాధానం చెప్పింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ – లావణ్య త్రిపాఠి కలిసి ఓ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ ఆ సినిమాలో లావణ్యకు బదులుగా నిత్యమీనన్ వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు బీమ్లా నాయక్. ఈ సినిమాలో మొదట పవన్ కల్యాణ్ భార్యగా లావణ్యను అనుకుందట చిత్ర బృందం. రీజనేంటో తెలియదు కానీ లాస్ట్ మినిట్లో నిత్య ఆ ప్రాజెక్టులోకి ఎంటరైంది. పవన్ కళ్యాణ్ హీరోగా రానా ప్రతి నాయకుడిగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ గా నిలిచింది.