Pawan kalyan: హరి హర వీర మల్లు పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్.

Posted by venditeravaartha, July 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ల లో ఎక్కువ గా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్ ,ఒక పక్క వరుసగా సినిమా లు చేస్తూనే మరో పక్క రానున్న సార్వత్రిక ఎన్నికల కి రెడీ అవుతూ వారాహి యాత్ర చేస్తూ బిజీ బిజీ గా ఉన్నారు.తాను కమిట్ అయినా సినిమా ల లో సాయి తేజ్ తో కలిసి చేసిన బ్రో జులై 28 న రిలీజ్ కి రెడీ అవుతుండగా హరీష్ శంకర్ తో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ ,సుజిత్ తో చేసే #OG లను శరవేగంగా పూర్తి చేసే పని లో ఉన్నారు.అయితే వారాహి యాత్ర లో ప్రస్తుతం బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు తాను కమిట్ అయినా సినిమా ల ను ఖచ్చితంగా పూర్తి చేసే ఎలక్షన్ ల కి వెళ్తారు అని సమాచారం ఉంది.

vaarahi

వారాహి విజయ యాత్ర సక్సెస్ అయినా నేపథ్యం లో ఇలానే ప్రజల మధ్యలో ఉంటె రానున్న ఎన్నికల లో జనసేన ప్రభావం ఎక్కువ గా ఉంటుంది అనేది జనసేన మరియు పవన్ ఫ్యాన్స్ అందరి అభిప్రాయం,అయితే అదే సమయం లో తాను ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం గా తన సినిమా లు కూడా పూర్తి చేసే బాధ్యత కూడా ఉంది అని అంటున్నారు.ఒక వేళా రాజకీయ లో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటే ముందుగా ఏ సినిమా ల ను పూర్తి చేయాలి అని కూడా ఒక అంచనా కి వచ్చారు అని తెలుస్తుంది.ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ,#OG ల షూటింగ్ లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్.అయితే తాను రీ ఎంట్రీ ఇచ్చాక కమిట్ అయినా క్రిష్ గారి హరి హర వీర మల్లు(Hari hara veera mallu) సినిమా గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

ustad

ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం గారి నిర్మాణం లో క్రిష్ డైరెక్షన్ లో పాన్ ఇండియన్ రేంజ్ లో హరి హర వీర మల్లు ని స్టార్ చేసారు.పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.దాదాపు 70 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదట కరోనా చేత ఆగిపోగా ఆ తర్వాత బడ్జెట్ సమస్యలు కూడా వచ్చాయి.అయితే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి రాజకీయాల లో కి వెళ్తున్న సమయం లో హరి హర వీర మల్లు సినిమా ని పూర్తి చేయాలి అని భావిస్తున్నారు అంట,ఇది వరకే డైరెక్టర్ క్రిష్ ,నిర్మాత తో చర్చలు కూడా జరిపారు అని తెలుస్తుంది.వారాహి రెండవ ఫేస్ యాత్ర అవ్వగానే దీని మీద క్లారిటీ రానుంది.

hari hara veera mallu

1724 views