Pawan Kalyan : సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అఖండ విజయం సాధించి, 21 కి 21 స్థానాల గెల్చుకొని చరిత్ర సృష్టించిన ఈ నేపథ్యం లో ఆయనకీ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రతీ ఒక్కరు ఈ విషయం లో ఆయన్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే ఏ స్థాయిలో సంతోషించారో నిన్న చిరంజీవి విడుదల చేసిన వీడియో చూస్తే అందరికీ అర్థం అవుతుంది. అభిమానులే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా ఈ వీడియో ని చూసి బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక ఊపు ఊపేస్తోంది.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తన కొడుకు అకిరా నందన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలిసినందుకు ఎంతో ఆనందించింది. ఇది ఇలా ఉండగా కేవలం రేణు దేశాయ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ విజయం పట్ల ఆయనకీ ప్రత్యేకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ స్నేహం గానే ఉంటుంది నందిని రెడ్డి. ఎన్నికల ప్రచార సమయం లో నందిని రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అలా వీళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్న ఈ నేపథ్యం లో ఆమె పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.