NTR: తన సినిమానే రీమేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్..ఆందోళనలో అభిమానులు!

Posted by venditeravaartha, May 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Devara : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందుగా వినపడుతుంది. చిన్న వయస్సులోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపారేసాడు. అలాంటి సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, రీసెంట్ గా విడుదల చేసిన మొదటి పాటకి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే వినపడుతుంది. అక్టోబర్ 11 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కథ ఎన్టీఆర్ గతం లో నటించిన ‘నరసింహుడు’ సినిమా తో పోలి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ పది ఊర్లకి కాపరి గా కనిపించబోతున్నాడట. ‘నరసింహుడు’ చిత్రం లో కూడా ఎన్టీఆర్ పాత్ర ఇలాగే ఉంటుంది. దీంతో అభిమానులు మళ్ళీ ఫ్లాప్ చిత్రాన్ని తిప్పి తీస్తున్నారా అని సోషల్ మీడియా లో దేవర మూవీ టీం ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.

ఒక సినిమాని పోలిన కథతో మరో సినిమా కథ ఉండడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కథ ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే విషయం లో పలు జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దేవర విషయం లో కొరటాల శివ అదే చేసాడని టాక్. కానీ కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ ఫలితాన్ని చూసి మళ్ళీ అలాంటి కళాఖండం ఎక్కడ తీస్తాడో అని ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త భయం ఉంది. చూడాలి మరి కొరటాల శివ అభిమానులను నిరాశపరుస్తాడో, లేదా అలరిస్తాడో అనేది. ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా పని చేస్తున్నారు.

317 views