ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ని తలచుకొని ఏడ్చేసిన యాంకర్ సుమ

Posted by venditeravaartha, February 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బుల్లితెర అయినా వెండితెర అయినా ఏ ఈవెంట్ కి సంబంధించిన యాంకరింగ్ అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుమ మాత్రమే,యాంకరింగ్ రంగం లో ఆమె సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి.చిన్న హీరో దగ్గర నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల వరకు ప్రతీ ఒక్కరికి సుమ కావాల్సిందే.ఆమె లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఏది లేదు. రీసెంట్ గా ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఈ ఈవెంట్ లో ఆమె ఎన్టీఆర్ – కొరటాల శివ అప్డేట్ గురించి చెప్పబోతుండగా ఎన్టీఆర్ కోపం తో ఆమెని ఉరిమి చూడడం పెద్ద చర్చకి దారి తీసింది, సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన దీని గురించి టాక్.

NTR Gets Serious On Anchor Suma

అయితే దీనిపై సుమ ఇటీవల జరిగిన అభిమానుల ఇంటరాక్షన్ లో స్పందించింది, ఆమె మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ – కొరటాల శివ అప్డేట్ చెప్పాలని ఆరోజు ఎన్టీఆర్ అనుకోలేదట,నేను పొరపాటున ఆ విషయం ప్రస్తావించేలోపు ఆయన నాపై అలాంటి లుక్ ఇచ్చాడు.నేను ఆరోజు నోరు జారడం వల్లే ఆయన ఆరోజు చెప్పాల్సి వచ్చిందట, మూవీ టీం వేరే పెద్ద అకేషన్ లో చెప్పడానికి సన్నాహాలు చేసుకుందట, ఈ విషయం ఎన్టీఆర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత చెప్పడంతో కాస్త నిరాశకి గురయ్యాను.కానీ నావల్ల మీకు రావాల్సిన అప్డేట్ తొందరగానే వచ్చింది కదా..ఎంజాయ్ చెయ్యండి’ అంటూ సుమ ఈ సందర్భంగా తెలిపింది.సుమ భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే, సుమ కూడా ఎన్టీఆర్ కి మంచి స్నేహితురాలు,వాళ్ళ మధ్య ఈ కోపాలు అలకలు చూసే మనకి కొత్త అనిపించొచ్చేమో కానీ, వాళ్లకి కాదు అంటూ కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags :
747 views