Nayantara : వంద కోట్లిచ్చినా ఆ హీరోతో సినిమా చేయనంటున్న నయనతార

Posted by RR writings, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Nayantara : నయనతార ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నటి నయనతార. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల ద్వారా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, పలు విషయాలలో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. కాలేజీలో చదువుతున్న సమయంలోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది నయనతార. ఒక షోలో దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ఆమెను చూశాడు. తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. అలా మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో నయనతార హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది. అయితే సుమారు రెండు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమను ఏలేస్తోంది. తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు 75 సినిమాలు చేసింది.

నయనతారకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పుతి నియమం. ఎకె సాజన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నయనతార నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును నయనతార అందుకుంది. తెలుగులో నయనతార ఎన్నో చక్కటి సినిమాల్లో నటించింది. దాదాపు అందరూ సూపర్ స్టార్ల సరసన నటించింది. అన్నింటికంతే మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా శ్రీరామ రాజ్యం. దిగ్గజ తెలుగు దర్శకుడు బాపు రూపొందించిన ఈ సినిమాలో బాలయ్య బాబుకు తోడుగా నటించి మెప్పించింది. సీతాదేవిగా ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రానికి గాను నయనతార ఎన్నో అవార్డులు అందుకుంది. నయనతార కెరీర్ లో గుర్తుండిపోయే మరో సినిమా రాజా రాణి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. సున్నతమైన ప్రేమను దర్శకుడు మలిచిన తీరు, ఆ పాత్రలో నయనతార ఒదిగిపోయిన విధానం అందరికీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను చూసి ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టకుండా ఉండలేడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన నటనకు గాను తమిళ సర్కారు నుంచి నంది అవార్డును దక్కించుకుంది. తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ సినిమాలో నటించింది.

అలాంటి నయనతార ఒక్కో సినిమాకు ఆమె సుమారుగా రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు రెట్టింపు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ పలు సినిమాలను తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడు వ్యాపార దిగ్గజం లెజెండ్ శరవణన్ సినిమాను నయనతార తిరస్కరించినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘ది లెజెండ్’. ఈ సినిమా 2022లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. ఉచితంగా టికెట్లు ఇచ్చినా కూడా సినిమాను చూడలేని పరిస్థితి. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌతేలా ఆయనకు జోడీగా నటించింది.

కానీ ఆయన మొదట తన సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఉంటే బాగుంటుందని ముచ్చట పడ్డారట. నయనతారను ఒప్పించేందుకు ఆయన చాలా ప్రయత్నించారట. నయనతార ఇంటి ముందు ఎప్పుడూ రోల్స్‌ రాయిస్‌ కారు ఉండేదట.. ఆ కారు ఎవరిదో కాదట లెజెండ్‌ హీరో శరవణన్‌దే.. తన సినిమాలో హీరోయిన్‌గా నటించాలని పలుమార్లు ఆయన నయనతార ఇంటికి వెళ్లేవారట. చెన్నైలో నయనతార ఉండే ప్రాంతం చాలా సెక్యూరిటీతో నిండి ఉంటుంది. అక్కడ ఎక్కువగా వీవీఐపీలు ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. అన్ని దాటుకుని ఆయన నయనతారతో మాట్లాడేందుకు వెళ్లే వారట. హీరోయిన్ గా నటిస్తే ఆమెకు డబుల్‌ రెమ్యునరేషన్‌ ఇస్తానని ఆఫర్‌ చేశారట.. అందుకు నయనతార నో చెప్పి.. రూ. 10 కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా నేను నటించనని డైరెక్ట్‌గానే చెప్పేసిందట.. ఆ కోపంలోనే బాలీవుడ్ హీరోయిన్‌ ఊర్వశి రౌతేలాను శరవణన్‌ తీసుకొచ్చారని ప్రచారం ఉంది.

409 views