Samantha :సమంత ఆ విషయం లో చాలా మొండిది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య!

Posted by venditeravaartha, November 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లుగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ.. అక్కినేని నాగ చైతన్య కొన్నేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. నాలుగేళ్లు గడవకముందే మనస్పర్థల కారణంగా విడిపోయారు. విడాకుల తర్వాత మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పిన ఈ జంట.. ఇప్పటివరకు ముఖాముఖి కూడా చూడలేదు.

విడాకుల తరువాత నుంచి వీరిద్దరూ వారి వారి కెరీర్లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. చైతన్య ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, సామ్ మయోసైటిస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోంది. నాగ చైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరై తన మాజీ భార్య సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

యాంకర్ నాగ చైతన్యను మీరు నటించిన కథానాయికలలో మీకు ఎలాంటి లక్షణాలు నచ్చుతాయి? అని ప్రశ్నించగా.. కృతి శెట్టి, పూజా హెగ్డే, సమంతల గురించి చెప్పాడు. సమంత గురించి మాట్లాడుతూ.. “సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేస్తుంది.. ఆమెకు సంకల్ప శక్తి ఎక్కువ. హార్డ్ వర్కర్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే సమంత మాత్రం ఎప్పుడు నాగ చైతన్య గురించి అడిగినా.. అతడు నా మాజీ భర్త.. ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటే కత్తితో పొడుస్తాను అని ఘాటుగా వ్యాఖ్యనించింది.

కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడు సమంత గురించి మాట్లాడినా మంచిగానే చెబుతాడు. ఇది చూస్తుంటే నాగ చైతన్యకు సమంత మళ్లీ తన జీవితంలోకి వస్తే బాగుండు అన్నట్లు ఉన్నట్లుంది. వారి అభిమానులు కూడా ఇదే కోరుతున్నారు. వారి కెరీర్ విషయానికి వస్తే చైతు చందు మొండేటి దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. చాలా కాలం క్రితమే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు.

881 views