METER:మీటర్ సినిమా రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

Posted by venditeravaartha, April 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజా వారు రాణి గారు సినిమా తో తెలుగు సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టిన ‘కిరణ్ అబ్బవరం’ తన రెండవ సినిమా ‘S R కల్యాణ మండపం’ తో సూపర్ హిట్ సాధించారు,ఆ సినిమా కి కథ ,మాటలు,స్క్రీన్ ప్లే తానే చేసుకున్నాడు, తర్వాత కాలం లో వరుసగా సినిమా లు చేస్తున్న సరైన హిట్ లభించలేదు ,ఇటీవలే రిలీజ్ అయినా ‘వినరో భాగ్యము విష్ణు కథ ‘ తో మరల హిట్ ట్రాక్ ఎక్కారు,తాజా గా తాను నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా ‘మీటర్’ సినిమా ఎలా ఉంది ? హిట్ కొట్టాడా ? లేదా చూద్దాం.

మీటర్ సినిమా కథ లో కి వెళ్తే అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ గా పని చేస్తూ తన నిజాయితీ కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. కొడుకుని ఎస్సై చేయాలనేది ఆయన కల. కానీ అర్జున్ కి పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్సై అయిపోతాడు అర్జున్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డిస్మిస్ అవ్వాలా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో (పవన్) అర్జున్ కళ్యాణ్‌కి క్లాష్ వస్తుంది. ఎలక్షన్స్‌లో అధికారంలోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కామ్ ఏంటి? దాని వల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రొటీన్ కమర్షియల్ ఫార్ములా నే ఇక్కడ కూడా ఉపయోగించారు డైరెక్టర్ . ఆవారాగా తిరిగే హీరో సడెన్‌గా పోలీస్ అవ్వడం, తన జీవితం మొత్తంలో అబ్బాయిలను అసహ్యించుకునే హీరోయిన్ ఒక్క పాటలోనే హీరోని లవ్ చేయడం, స్టేట్ సీఎంని కూడా వణికించే విలన్,హీరో ముందు పిల్లిలా మారిపోవడం ఇలా ఇప్పటికే చాలా సార్లు చూసేసిన సీన్లు ఇందులో చాలానే ఉన్నాయి.

సినిమా ఫస్టాఫ్ అంతా పోలీస్ అవ్వకుండా ఉండటానికి హీరో చేసే ప్రయత్నాలు, పోలీస్ అయ్యాక జాబ్ నుంచి డిస్మిస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ ఇలా సాగుతుంది. ఒక ట్విస్ట్(?)తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారు. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్‌ల మధ్య ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఒక నాలుగు ఐదు పాత కమర్షియల్ సినిమా ల ని మిక్సీ లో వేసి తీసినట్టు ఉంటుంది మీటర్ సినిమా.

ప్లస్ :కిరణ్ అబ్బవరం ఎనర్జీ ,కొన్ని కామెడీ సీన్ లు
మైనస్ :పాత కథ ,లాజిక్ లేని సీన్ లు ,సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫైనల్ గా కిరణ్ అబ్బవరం కోసం ఒక సారి చూడొచ్చు
రేటింగ్ :2 / 5

881 views