Mem famous: మరికొన్ని థియేటర్లలో ‘మేము ఫేమస్’ ఫ్రీ షో..

Posted by venditeravaartha, May 31, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా హిట్టు కావడానికి యూత్ అండ బాగా ఉంటుంది. యంగర్స్ బ్యాగ్రౌండ్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్టయ్యాయి. ఇటీవల దాదాపు అయన్నీ యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో సందడి చేస్తున్నాయి. కుర్రకారు గురించి వచ్చే సినిమాలు తక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది యువకులు కలిసి ‘మేము ఫేమస్’(Mem famous) అనే చిత్రాన్ని తీశారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కుర్రాళ్లలో జోష్ నింపేస్తున్న ఈ సినిమా మే నెల 26న థియేటర్లోకి వచ్చి సందడి చేస్తోంది. అయితే ఈ మూవీని కొందరికి ఉచితంగా చూపిస్తున్నారు. కానీ అందరికీ కాదు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం..

mem famous

యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారు ఇప్పటికే చాలా మంది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ‘సుమంత్ ప్రభాస్’(Sumanth prabhas) అనే యంగ్ టైగర్ యూట్యూబ్ లో ఫుల్ ఫాపులర్. దీంతో సినిమాల్లో చేయ్యేస్తే పోలా.. అన్నట్లుగా తాను హీరోగా నటించి ‘మేము ఫేమస్’ అనే మూవీని తానే తీశాడు. అయితే ఈ మూవీకి రిలీజ్ కు ముందే అంచనాలు భారీగా పెరిగాయి. స్టార్ నటులతో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇన్వాల్వ్ అయి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య మే నెల 26న థియేటర్లకు వచ్చింది.

sumanth prabhas

అనుకున్నట్లుగానే ఈ సినిమా ఫస్ట్ డేకు కోటి రూపాయల కలెక్షన్ వచ్చింది. దీంతో డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో పాలు పంచుకున్న ఆనందాలు వెల్లివిరిశాయి. అంతేకాకుండా ఈ మూవీ బాగుందంటూ స్టార్ హీరో మహేష్ తో పాటు నాని, నాగచైతన్య, రానా, అడవి శేషు, నవీన్ పోలిశెట్టి తదితరులు ట్విట్ ద్వారా ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాను ఫ్రీగా చూపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత శనివారం ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ ఉచితంగా చూపించారు.

mem famous

అయితే ఆంధ్రాలోని పలు థియేటర్లలోనూ ప్రత్యేక రోజుల్లో ఉచితంగా ఫ్రీ షో చూపించాలని నిర్ణయించారు. మరోవైపు కొన్ని థియేటర్లలో దీనిని రూ.99కే చూడొచ్చని తెలిపారు. రిలీజ్ కు ముందే ఎంతో ఆదరణ పొందిన ఈ మూవీ ఆ తరువాత కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇదిలా ఉండగా మేము ఫేమస్ సినిమానకు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి మనోహర్ నిర్మించగా.. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, శౌర్య, సిరి రాసి కీలక పాత్రలలో నటించారు.

553 views