Trivikram: త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్న మహేష్ ఫ్యాన్స్..

Posted by venditeravaartha, July 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా ‘గుంటూరు కారం’పై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ మూవికి సంబంధించిన లుక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇందలో హాట్ బ్యూటీ శ్రీలీల కూడా ఉండడంతో మూవీకి మంచి మసాల ఉంటుందని ఆశిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ తన మాటల గారడితో మాయ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు మూవీస్ హిట్టు అయ్యాయి. మరో మూవీ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ ఈ తరుణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఫ్యాన్ష్ భగ్గుమంటున్నారు. మహేష్ విషయంలో త్రివిక్రమ్ నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

gunturkaaram

ప్రస్తుతం బిజీ ఉన్న డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఓ వైపు సినిమాలకు నేరుగా డైరెక్షన్ చేస్తూనే.. మరో వైపు పవన్ కల్యాణ్ లాంటి సినిమాలకు పర్యవేక్షణగా ఉంటున్నారు. అయితే మహేష్ తో తీసే ‘గుంటూరు కారం’ కాస్త ఆలస్యమవుతోంది. స్క్రిప్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో హీరోయిన్లను మార్చడం వంటి విషయాలు సినిమాకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే మహేస్ పక్కన శ్రీలీల హీరోయిన్ కన్ఫామ్ అయింది. మరో హీరోయిన్ పూజా హెగ్డే అనుకున్నారు. కానీ ఇటీవల ఆమెను మార్చుతున్నారని చెప్పారు. వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల గుంటూరు కారం వాయిదా పడింది.

mahesh babu

ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో ఓ మూవీ తీస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆ షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా చెప్పారు. ఇటు మహేష్ సినిమా పూర్తి కాకముందే బన్నీ సినిమాను ప్రకటించడంపై ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ గుంటూరు కారంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎంత తొందరగా వస్తే అంత బావుండు.. అని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాను వాయిదా వేస్తూ.. బన్నీ సినిమాను ఇప్పుడే ప్రకటించాలా? అని అంటున్నారు.

allu arjun

ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళితో కలిసి పని చేయనున్నాడు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. రాజమౌళి ఫ్యాక్టరీకి మహేష్ వెళ్లాడంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు ప్యాక్ అయిపోతాడు. దీంతో త్రివిక్రమ్ సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం గుంటూరు కారం ను వాయిదాలు వేయడంతో అసలు అనుకున్న సమయానికి సినిమా థియేటర్లోకి వస్తుందా? అని చర్చించుకుంటున్నారు.

1977 views