Mahesh Babu: అంతా అబద్ధం.. మహేష్ రూ.5కోట్లు తీసుకోలేదట.. ఎంత తీసుకుండంటే ?

Posted by RR writings, February 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Mahesh Babu: సినిమాలే కాదు.. కమర్షియల్, బిజినెస్ పరంగా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నెక్స్ట్ లెవెల్. కమర్షియల్ గా టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఒక్కో యాడ్ కోసం కోటి రూపాయలు తీసుకుంటున్నాడు మహేష్. 5 సెకన్ల యాడ్ కు 5 కోట్లు తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన సంగతి తెలిసిందే. Phone Pay, Google Pay, Paytm వంటి అనేక UPI యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో PhonePay UPI మహేష్ బాబుతో జతకట్టింది.

ఫోన్ పే ద్వారా డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తే, మనీ రిసీవ్డ్.. హ్యాట్సాఫ్ గురుగారూ అంటూ మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుంది. అయితే ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ బాబుకు ఫోన్ పే కంపెనీ 5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అంటే సెకనుకు రూ. కోటి? ఇది విన్న అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇందులో వాస్తవం లేదని అంటున్నారు. ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు వ్యవహరిస్తున్నారు.

అందుకోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్నది నిజమే కానీ.. కేవలం 5 సెకన్ల వాయిస్ కోసం 5 కోట్లు తీసుకోలేదని మహేష్ బాబు టీం క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌ వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. అందులో భాగంగా కొన్ని యాడ్స్‌తో పాటు.. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. అంతే తప్పా.. వాయిస్ ఓవర్ కోసమే ఆయన అంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న మాట వాస్తవం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. యాడ్స్ విషయంలో మహేష్ తర్వాతే ఏ హీరో అయినా !

302 views