Prabhas-Krishnam Raju: ప్రభాస్ ఆ రాత్రి ఎంజాయ్ చేయడానికి కృష్ణం రాజు ఏం చేశాడో తెలుసా?

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ ( Prabhas ) భారీ బడ్జెట్ చిత్రాలే నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘సాలార్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పర్సనల్ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ పెద్దనాన్న, సీనియర్ నటుడు కృష్ణం రాజు ( Krishnam Raju )కు ప్రభాస్ కు ఉన్న అనుబంధాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. వీరిద్దరు సొంత తండ్రికొడుకులు కాకపోయినా.. అంతకంటే ఎక్కువగా చనువుగా ఉండేవారు. కృష్ణం రాజు తనకు కొడుకు లేని లోటును ప్రభాస్ తీర్చాడని ఆయన అప్పుడప్పుడూ అంటుంటారు. అయితే ప్రభాస్ కు సంబంధించి కృష్ణం రాజు ఓ రాత్రి అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందట.

జీవితంలో తాను ప్రభాస్ కోసం పెట్టిన ఖర్చు ఇదేనని కృష్ణం రాజు అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈశ్వర్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రభాస్ ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు. కానీ రాజమౌళి తీసిన ఛత్రిపతి నుంచి ఈ రెబల్ స్టార్ రేంజ్ పెరిగిపోయింది. అప్పటినుంచి ఆల్ టైం మాస్ హీరోగా ఆడియన్స్ ను అలరిస్తూ ఉన్నాడు. ప్రభాస్ నటనకు చాలా మంది ఫిదా అయి ఫ్యాన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇక రాజమౌళి ఆధ్వర్యంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రాలతో ప్రభాస్ పాన్ వరల్డ్ అని ఫ్యాన్స్ అంటుంటారు. ఎంత ఎతుకు ఎదిగిన తన గాడ్ ఫాదన్ కృష్ణం రాజు అని ప్రభాస్ చాలా సందర్భాల్లో చెప్పారు.

ఈ క్రమంలో ప్రభాస్, కృష్ణం రాజులు కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి బిల్లా, రెబల్, రాధే శ్యాం చిత్రాల్లో నటించారు. బిల్లా సినిమాలో ప్రభాస్ లుక్ కంప్లీట్ గా చేంజ్ ఉంటుంది. ఈ సినిమా బాగున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి కృష్ణం రాజు నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రభాస్ కోసం కృష్ణం రాజు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందట. బిల్లా షూటింగ్ సమయంలో కృష్ణం రాజు ఓ బడ్జెట్ ను అనుకున్నారు. కానీ ఇదే సమయంలో న్యూ ఇయర్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్ ఎంజాయ్ చేయడానికి కృష్ణం రాజు ఓ పబ్ ను బుక్ చేశాడట. ఇందులో ప్రభాస్ వెళ్లి వేడుకలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారట. అయితే ప్రభాస్,కృష్ణం రాజులు కలిసి నటించినా బిల్లా సినిమా టీవీల్లో వచ్చి ఇప్పటికీ అలరిస్తూ ఉంటుంది.

Tags :
1839 views