Pawan kalyan: వారాహి యాత్ర లో అల్లు అర్జున్ పేరు చెప్పకపోవడం వెనుక కారణం ఇదే నా ?

Posted by venditeravaartha, July 2, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఈ పేరు వినడబడగానే అతని ఫ్యాన్స్ కి తెలియని ఉత్సాహం వస్తుంది అలానే తన యాంటీ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని నిరుత్సాహము వస్తుంది.ఇది అంత కూడా కేవలం సినిమా ల ప్రకారం.కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి ని సినిమాల కి అతీతంగా అభిమానించే వారు ఇంకా ఎక్కువ గా ఉన్నారు.అతను సమాజానికి చేసిన సేవ మరియు రాజకీయాల లో అతని నిజాయితీకి చాల మంది హీరో ల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతారు.కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లా లో చేస్తున్నా వారాహి యాత్ర లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే తనకి అందరి అభిమానుల మద్దతు కావాలి అని అడిగారు.

pawan

గోదావరి జిల్లా ల లో సినిమా ని విపరీతంగా ఇష్టపడుతారు,అందులోను మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మరియు ప్రభాస్(Prabhas) ,మహేష్ బాబు(Mahesh babu) గారి సినిమా ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది  ఈ మధ్య భీమవరం ,అమలాపురం వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చరణ్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు ,ప్రభాస్ ,చిరంజీవి అంటే తనకి ఇష్టం అని కానీ అందరి అభిమానులు ఈ సారి జనసేన పార్టీ కి సపోర్ట్ చేయాలి అని కోరారు.ఇక ఇంతటి తో ఆగకుండా తన కంటే కూడా మహేష్ ,ప్రభాస్ ,ఎన్టీఆర్ ,చరణ్ పెద్ద హీరో లు అని పాన్ ఇండియన్ సినిమా లు చేస్తూ చాల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు అని మాట్లాడారు.

mahesh ntr

అయితే పవన్ కళ్యాణ్ గారు మంచిగానే చెప్పినప్పటికీ ఇప్పుడు ఆయన కొంతమంది నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు.మహేష్ ,ప్రభాస్ ,ఎన్టీఆర్(Ntr) ,రామ్ చరణ్(Ram charan) పేర్లు సభ ల లో పదే పదే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అలా వైకుంఠ పురము లో ,పుష్ప వంటి సినిమా ల తో పాన్ ఇండియన్ రేంజ్ లో పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు ఆయన అభిమానులకి కోపాన్ని తెప్పించింది.కేవలం పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోవడం వలన తమ హీరో తక్కువ కాదు అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

allu arjun

మరి కొంత మంది అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ని స్టేజి ల మీద చెప్పడానికి నో చెప్పిన అల్లు అర్జున్(Allu arjun) గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటే మరి కొంత మంది మాత్రం పవన్ కళ్యాణ్ గారు మరిచిపోయి ఉంటారు ఏమో అనుకుంటున్నారు.కానీ నిజానికి అయితే అల్లు అర్జున్ గారికి గోదావరి జిల్లా ల లో అభిమానులు ఏమి తక్కువుగా లేరు..ఎన్టీఆర్ మహేష్ ,ప్రభాస్ సినిమా ల రేంజ్ లోనే అల్లు అర్జున్ సినిమా లు కూడా ఆడుతాయి.మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అల్లు అర్జున్ పేరు ని ఆయన అభిమానుల సపోర్ట్ ని ఆశించడం లేదో త్వరలోనే తెలియాల్సి ఉంది.

2114 views