Allu arjun: రాజమౌళి ,ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ లు నాకు అవసరం లేదు:అల్లు అర్జున్

Posted by venditeravaartha, May 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2003 లో రిలీజ్ అయినా గంగోత్రి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్(Allu arjun) తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.రాఘవేంద్ర రావు గారి 100 వ చిత్రం గా వచ్చినా ఈ సినిమా ని అశ్వినీదత్ మరియు అల్లు అరవింద్ గార్లు నిర్మించారు.రెండవ సినిమా ఆర్య తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ బన్నీ లాంటి సూపర్ హిట్ తో హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకున్నారు.అప్పటివరకు అల్లు అర్జున్ కి ఉన్న ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ వచ్చిన పూరీజగన్నాధ్ ‘దేశముదురు’ సినిమా తో అల్లు అర్జున్ టాప్ స్టార్ ల లో ఒకరు గా ఎదిగారు.ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా తో అల్లు అర్జున్ రేంజ్ ఒక్క సారిగా ఇండియా అంతటా వ్యాపించింది.

pushapa

అల్లు అర్జున్ ,సుకుమార్(Sukumar) కలయిక లో 2021 డిసెంబర్ 17 న  రిలీజ్ అయినా పుష్ప(Pushpa) మూవీ తెలుగు, హిందీ,తమిళ్,కన్నడ,మలయాళ భాషల లో రిలీజ్ చేసారు. మొదట డివైడ్ టాక్ వచ్చినప్పటికి హిందీ లో 100 కోట్ల పైన కలెక్షన్స్ సాధించి అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా గా రికార్డు సృష్టించింది.ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ ల లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ ల మీద కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పటివరకు తాను  పని చేసిన డైరెక్టర్ లు రీజినల్ సినిమా లు చేసిన వారే,తనకి ఆర్య ,ఆర్య 2 ,పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ల ను అందించిన సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఉన్నారు.పుష్ప 2 తర్వాత సుకుమార్ గారి రేంజ్ ఏ స్థాయి లో ఉండబోతుందో చాల ఇంట్రస్టింగ్ గా మారనుంది.

rajamouli sukumar

ఇటీవల అల్లు అర్జున్ ఒక రియాలిటీ షో లో పాల్గొన్నప్పుడు తాను ఎందుకు పాన్ ఇండియన్ డైరెక్టర్ లు అయినా రాజమౌళి(Rajamouli),ప్రశాంత్ నీల్(Prasanth neel),శంకర్ లాంటి వారితో పనిచేయడం లేదు అని అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ తనకి పాన్ ఇండియన్ డైరెక్టర్ లు అవసరం లేదు అని తానే పాన్ ఇండియన్ డైరెక్టర్ ల ని రెడీ చేయగలను అని చెప్పారు.అయితే అల్లు అర్జున్ వ్యాఖ్యలు మీద మిశ్రమ స్పందన వస్తుంది తనకి ఆర్య,పుష్ప సినిమా లు ఎంతగానో హెల్ప్ అయ్యాయి అని అవి డైరెక్ట్ చేసిన సుకుమార్ తన కెరీర్ లో నేనొక్కడినే,నాన్నకు ప్రేమతో ,రంగస్థలం వంటి సినిమా ల తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు అని ఆయనకు అల్లు అర్జున్ బ్రేక్ ఇవ్వడం ఏంటి అని స్పందిస్తున్నారు.

allu arjun sukumar

800 views