Baby Movie: అంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసావు! బేబీ మూవీ డైరెక్టర్ మీద సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్.

Posted by venditeravaartha, July 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ ని బయట ప్రపంచానికి చూపించి ఆ తర్వాత వెబ్ సిరీస్ లు ,సినిమా లలో అవకాశాలు తెచ్చుకుంటున్నారు.వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతున్నప్పటికీ అందులో కొందరు సాయి రాజేష్ అని చెప్పాలి,మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తి తో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత సంపూర్ణేష్ తో హృదయకాలేయం మూవీ చేసారు.ఈ సినిమా కమర్షియల్ గా మంచి గుర్తింపు తీసుకుని వచ్చి ఆ తర్వాత కలర్ ఫోటో సినిమా చేసే నమ్మకాన్ని కలిగించింది.కలర్ ఫోటో తో నేషనల్ అవార్డు ని గెలుచుకున్న సాయి రాజేష్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య ,విరాజ్ ల తో బేబీ అనే సినిమా ని చేసారు.

sai rajesh

న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా వచ్చిన బేబీ మూవీ మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్ తో అన్ని దగ్గరలా హౌస్ ఫుల్ కలెక్షన్ ల తో దూసుకునిపోతుంది.సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో అందరికి పరిచయం అయినా వైష్ణవి ఈ సినిమా లో ప్రధాన పాత్రా లో చేసి అందం,నటన తో అందర్నీ అలరించింది.ఇక ఆనంద్ దేవరకొండ అయితే ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పొచ్చు.తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబీ మూవీ.అయితే ఇంత ప్లస్ వైబ్స్ ఉన్న ఈ సినిమా లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అంటూ కొంత మంది సోషల్ మీడియా ల లో సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

baby

మొదటి సారి కలిగిన ప్రేమ చివరి వరకు అలానే ఉంటుంది మధ్య లో ఎదురైనా అనుకోని
సంఘటనలను జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ప్రధాన కథాంశం గా సాయిరాజేష్ బేబీ సినిమా ని మన ముందుకు తీసుకుని వచ్చారు.ఇందులో మొదట భాగం చాలా క్లియర్ గా ఇంటెన్స్ తో ఉన్నపటికీ సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ చేసాడు దానికి తోడు వైష్ణవి క్యారెక్టర్ ని పూర్తిగా నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.అసలు బేబీ మూవీ లో ప్రధాన పాత్రలు అయినా ఆనంద్ ,వైష్ణవి ,విరాజ్ ల ఎవరిది కూడా తప్పు అనేది ఉండదు కాయాన్ని చివరికి ఆనంద్ మాత్రమే లవ్ ఫెయిల్యూర్ గా మిగిలిపోవడం తన ప్రేమ కోసం తాగుతూ ఉండటం మరో పక్క వైష్ణవి పెళ్లి జరగడం అసలు విరాజ్ మధ్యలో వెళ్లిపోవడం ఎలా క్లైమాక్స్ ని సరిగా పూర్తి చేయకపోవడం తో సాయి రాజేష్ మీద నెగటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి.దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న సినిమా కి సరైన ఎండింగ్ లేదు.

baby movie

2838 views