సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్రా లోకేష్(Pavithra lokesh) లు కలిసి నటించిన మూవీ ‘మళ్లీ పెళ్లీ’. ఈ మూవీ మే 26న థియేటర్లోకి వస్తోంది. ఈమధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ‘మళ్లీ పెళ్లీ’ సినిమా నరేష్, పవిత్రా లోకేష్ లకు సంబందించినదా? లేక కల్పితమా? అని కొందరు చర్చిస్తున్నారు. కొన్ని నెలలుగా వీరిద్దరు మళ్లీ పెళ్లి చేసుకుంటారని కథనాలు వచ్చాయి. ఆ తరువాత అవును మేం ఒక్కటవుతాం.. అని చెప్పారు. ఇంతలో మళ్లీ పెళ్లీ సినిమా రావడంతో అంతా వీరి సినిమానే అని అనుకున్నారు. కానీ ఇందులో నటించిన పవిత్రా లోకేష్ మాత్రం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం.
విజయ్ కృష్ణ బ్యానర్ పై వీకే నరేష్ నిర్మాతంగా .. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు డైరెక్షన్లో వస్తున్న మళ్లీ పెళ్లి(Malli pelli) సినిమాలో నరేష్, పవిత్రా లోకేష్ లతో పాటు జయసుధ, శరత్ బాబు, అన్నపూర్ణ తదితరుల నటించారు. ఈ సందర్భంగా కొందరు పవిత్రా లోకేష్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి.. తన తోటి నటుడు నరేష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఈ సినిమాలో నాదీ మెయిన్ రోల్స్. తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. మంచి పాత్రల కోసం వెయిట్ చేశారు. కానీ మళ్లీ పెళ్లీ సినిమాలో ప్రాధాన్యత పాత్ర రావడంతో ఎంతో సంతోషించాను. ఇందులో నాది హీరోయిన్ పాత్రే అనుకోవచ్చు. సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆడియన్స్ ఈ సినిమాకు వెంటనే కనెక్ట్ అవుతారు. కొన్ని పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి..అని పవిత్ర అన్నారు.
ఇక ఈ సినిమా మీ బయోపిక్ నా.. అని కొందరు అడుగుతున్నారు. అయితే దీనిని బయోపిక్ అనుకోవడం కంటే మా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందులో చేర్చారు.. డైరెక్టర్ ఎంఎస్ రాజు కథను మా దగ్గరకు తీసుకొచ్చి ఇది నరేష్, మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని అన్నారు. ఎంఎస్ రాజు(Ms Raju) గారిని నిర్మాతగానే చూశాను. కానీ ఆయన డైరెక్షన్లో నటించడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఆయన ఆలోచనలు ఎప్పుడూ ట్రెండింగ్ గా ఉంటాయి.. అని పవిత్రా లోకేష్ అన్నారు.