Samantha: గర్భం దాల్చిన సమంత..నాగ చైతన్యకి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్!

Posted by venditeravaartha, July 29, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Samantha Ruth Prabhu: సౌత్ ఇండియా లో స్టార్ హీరోలతో సమానమైన స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈమె ఒక సినిమాలో ఉందంటే కేవలం ఈమెని చూసేందుకు థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అందుకే ఈమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అయినా వెనకాడరు దర్శక నిర్మాతలు. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో సమంత ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలకు లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. రీసెంట్ గా ఈమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలను చూసి ఆమె అభిమానులు కంగుతిన్నారు.

ఈ ఫొటోలో ఆమె ప్రెగ్నన్సీ కిట్ తో దర్శనం ఇవ్వడంతో, ఆమ్మో సమంత గర్భం దాల్చిందా, ఇదెలా సాధ్యం?, నాగ చైతన్య తో విడిపోయి చాలా కాలం అయ్యింది కదా, అతనితో విడిపోయిన తర్వాత వేరే వారితో రిలేషన్ లో ఉన్నట్టు కూడా ఎప్పుడూ మనం చూడలేదు కదా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు, సందేహాలు అభిమానుల్లో తలెత్తాయి. అసలు సంగతి ఏమిటో తెలుసుకునేందుకు అభిమానులు ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ తెరిచి చూడగా అప్పుడు అసలు నిజం తెలుసుకొని కాస్త కుదుటపడ్డారు. సమంత చేతిలో ఉన్నది ప్రెగ్నన్సీ కిట్ కాదు, తేన శాతాన్ని కొలిచే మీటర్ అట. ఫైండ్ హానీ అని ఆ కిట్ మీద రాసుంది. అలా ఒక్కసారిగా గందరగోళంకి గురైన సమంత అభిమానులు, ఈ పోస్ట్ చూసిన తర్వాత రిలాక్స్ అయ్యారు. ఇకపోతే సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

మయోసిటిస్ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమెకు డాక్టర్లు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాసిందిగా సూచించారు. దీంతో ఆమె ప్రస్తుతానికి సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అయితే ఈమె అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది, ఈ ఏడాది లోనే ఈ సిరీస్ టెలికాస్ట్ కి సిద్ధం అవుతుంది. ఈ సిరీస్ తో పాటు పలు సినిమాలు చెయ్యడానికి కూడా ఆమె సంతకం చేసింది. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఉంది. అలాగే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సంతకం చేసింది. తమిళ హీరో విజయ్ తో ఒక సినిమా చేసేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సుదీర్ఘ గ్యాప్ తర్వాత సమంత కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

573 views