Actor Naresh : ఆమెతో పెళ్లి అయ్యాక నరకం అనుభవిస్తున్నాను అంటూ నటుడు నరేష్ సంచలన కామెంట్స్

Posted by venditeravaartha, September 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సీనియర్ హీరో నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు ప్రేక్షకుల అందరికీ ఆయన సుపరిచితుడే. కెరీర్ మొదట్లో హీరోగా చాలా చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన జంబలకిడిపంబ సినిమా నేటికి టీవీలో చూసిన ప్రజలు కడుపుబ్బ నవ్వుకుంటారు. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. దాదాపు చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి సినిమాలో ఆయన కనిపిస్తున్నారు. సినిమాల కంటే కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. నరేష్ ముచ్చటగా ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తన మూడో భార్య రమ్య రఘుపతి తో విడాకులు తీసుకుని.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బయట పెట్టిన దగ్గర నుంచి వీరు సోషల్ మీడియా స్టార్ట్స్ అయిపోయారు.

నరేష్ తన తల్లి విజయనిర్మల చనిపోయిన తర్వాత.. డిప్రెషన్లోకి వెళ్లారు. ఆ తర్వాత వ్యక్తిగత విషయాల కారణంగా తలెత్తిన వివాదాలతో సతమతమవుతున్న టైంలో పవిత్ర లోకేష్ తో అతడికి దగ్గరైంది. ఆమె తన జీవితంలోకి వచ్చిన తర్వాతనే సంతోషం వచ్చిందని నరేష్ పేర్కొన్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల సమయంలో పవిత్ర లోకేష్ తనకు చాలా సపోర్టుగా నిలిచిందని నరేష్ చాలా సార్లు పేర్కొన్నాడు. ఇటీవల గుడివాడ తదితర చోట్ల పవిత్ర లోకేష్, నరేష్ కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

దీంతో నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నరేష్ ఆ విషయంపై నరేష్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము కలిసి జీవిస్తున్నాం పెళ్లయితే చేసుకోలేదన్నారు. గతంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మైసూర్ హోటల్ లో పవిత్ర లోకేష్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో అక్కడ రచ్చ రచ్చ జరిగింది. మీడియాలో మొదటి సారి వారి బంఢారం బయట పడింది. ఆ సమయంలో హోటల్ బయట నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరి విషయం బట్టబయలు చేసింది. ఆగ్రహంతో వారిపై ఊగిపోయింది. ఈ టైంలో నరేష్ కూడా రమ్య పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం నరేష్ – పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూనే ఉన్నారు. అలా వారిద్దరూ కలిసి పలు షోలకు, ఈవెంట్లకు హాజరవుతూనే ఉన్నారు. తాజాగా ఓ టీవీ షోకి వచ్చి.. వారిద్దరూ రచ్చ రచ్చ చేశారు. నటుడిగా నరేష్ తన 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తన మాజీ భార్య రమ్య రఘుపతి వద్ద ఉన్న తన కొడుకుకి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెతో పెళ్లయిన తర్వాత జీవితంలో సంతోషం అంటే ఏంటో చూడలేదని బాధపడ్డాడు. తాను జీవితంలో అతి పెద్ద తప్పు చేశానని పేర్కొన్నాడు. నా కొడుకు ఆమె దగ్గరుంటే భవిష్యత్ ఉండదంటూ ఎమోషనల్ అయ్యాడు.

336 views