Movie Review:ఎక్సక్లూసివ్ గా మీ కోసం ‘దాస్ కా ధమ్కీ’ రివ్యూ

Posted by venditeravaartha, March 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2017 లో రిలీజ్ అయినా ‘వెళ్ళిపోమాకే ‘ సినిమా తో తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెట్టారు విశ్వక్ సేన్ ,మొదటి సినిమా ఆశించిన ఫలితం రాలేదు ,కానీ తర్వాత 2018 లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది ‘ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు ,అందులో ‘వివేక్ ‘ పాత్రా లో అలరించారు, తర్వాత తన స్వీయ నిర్మాణ ,దర్శకత్వం లో వచ్చిన ‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌’ కూడా సూపర్ హిట్ అయింది,మరల ఇప్పుడు తానే నిర్మించి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ ‘ ఉగాది శుభాకాంక్షల తో రిలీజ్ అయింది ,రిలీజ్ అయినా ప్రతి దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది , మరి సగటు ప్రేక్షకుడు కి ఈ సినిమా ఎలా ఉంది ,ఎవరు ఎలా చేసారో చూద్దాం .

విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీ ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనేది మొదటి నుంచి ప్లాన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాగల్ సినిమా లో హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ నివేత పేతురాజ్ విశ్వక్ సేన్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. విశ్వక్ సేన్ తన బోల్డ్ యాటిట్యూడ్, మ్యానరిజమ్స్ తో యువతలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రాల్లో తన పంథా మార్చుకుని వైవిధ్యం ప్రదర్శించాడు. నేడు రిలీజ్ అయినా దాస్ కా ధమ్కీ చిత్రంతో విశ్వక్ సేన్ తిరిగి తన జోన్ లోకి వచ్చాడు. దాస్ కా ధమ్కీ చిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి ఫాన్స్ కి ఉగాది గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు.


ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా విశ్వక్ సేన్ మార్క్ లోనే సాగుతుంది.
విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. కథ స్లోగా మొదలై ఇంటర్వెల్ చేరుకునే కొద్దీ ఆసక్తిగా ఉంటుంది. ఎక్కువ భాగం కథ చెప్పుకునేంత గొప్పగా అయితే లేదు. కామెడీ టైమింగ్ తో, మాస్ అంశాలతో నడిపించారు. ఇక హీరో ,హీరోయిన్ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా సినిమా ల లో చూసినదే అయినప్పటికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ లో చూపించి వర్కౌట్ అయ్యేలా చేసారు.

విశ్వక్ సేన్ మొదట గా కృష్ణదాస్ పాత్రలో కనిపిస్తాడు. తన స్నేహితులతో కలసి స్టార్ హోటల్ లో పనిచేస్తుంటాడు. కస్టమర్స్ నుంచి కృష్ణదాస్ కి తరచుగా అవమానాలు ఎదురవుతుంటాయి. ఇక కీర్తి (నివేత పేతురాజ్) తో పరిచయం తర్వాత కృష్ణదాస్ లైఫ్ లో ప్రేమ మొదలవుతుంది. కథ సాఫీగా సాగుతూ ఉండగా రావు రమేష్ పాత్రతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఇవన్నీ రెగ్యులర్ గా అనిపించే సన్నివేశాలే. కానీ విశ్వక్ సేన్ మాస్ కి నచ్చే విధంగా టేకింగ్ లో వైవిధ్యం చూపించాడు.

ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఒకే అన్నట్లు గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా ని ఒక రేంజ్ లో కి తీసుకుపోవాలనే ఆలోచన కావచ్చు , అవసరం లేకపోయినపటికి ట్విస్ట్ లు ఎక్కువ ఉన్నాయి . దీనికి తోడు కన్ఫ్యూషన్ డ్రామా కూడా ఎక్కువే. విశ్వక్ సేన్ తనదైన శైలిలో చెప్పే బోల్డ్ మాటలు యూత్ కి బాగా నచ్చుతాయి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది తప్పదు.సెకండ్ హాఫ్ లో వైటర్ గా పని చేసే దాస్ , సంజయ్ గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే డ్రామా కాస్త చిరాకు పుట్టిస్తుంది. కథని నడిపించడం కోసం ,
అవసరం లేని సన్నివేశాల లో పోరాట సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే విశ్వక్ సేన్ ఫైట్స్ తో అంత కిక్కు ఇవ్వలేదు.

చిరవరగా ఈ సినిమా లో విశ్వక్ సేన్ కామెడీ, యాక్టింగ్ కి మంచి మార్కులే వేయాలి.నివేత తన పాత్రా కి మించిన అభినయం ,తన అందం సినిమా కి ప్లస్ అయింది. ముఖ్యం గా లియోన్‌ జేమ్స్ పాటలు స్క్రీన్ పై ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి. ఓవరాల్ గా దాస్ కా ధమ్కీ చిత్రం రెగ్యులర్ ఫార్మాట్ లో, విశ్వక్ సేన్ స్టయిల్ లో తెరకెక్కించిన కమర్షియల్ మూవీ.సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదు ,2 గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ వారం దాస్ కా ధమ్కీ బెస్ట్ ఛాయస్.


ప్లస్ : విశ్వక్ సేన్ ,నివేత గ్లామర్ , కామెడీ , సాంగ్స్, రిచ్ ప్రొడక్షన్
మైనస్ : అర్ధం లేని సెకండ్ హాఫ్ , స్క్రీన్ ప్లే
రేటింగ్ : 3 .5 / 5

525 views