Venkatesh: వెంకటేష్ పక్కన తెలుగులో ఐశ్యర్య నటించాలనుకున్న ఆ సినిమా ఏదో తెలుసా?

Posted by venditeravaartha, June 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అందం గురించి చెప్పేటప్పుడు ఐశ్వర్య(Aishwarya) గురించే మాట్లాడుతుంటాం. మాజీ మిస్ సుందరి అయిన ఆమె ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. దశాబ్దాలుగా తన బ్యూటీ నెస్ తో ఎంతో వినోదాన్ని పంచిన ఈమె భారత్ లోని పలు భాషల్లోని చిత్రాల్లో నటించింది. తెలుగు ఇండస్ట్రీలో ఐశ్వర్య సినిమాలంటే చూడని వారుండరు. కానీ ఆమె టాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఓ సారి ఆ ప్రయత్నం మొదలు పెట్టారు సురేష్ ప్రొడక్షన్ వారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమెను తీసుకోలేకపోయారు. దీంతో ఆమె తెలుగులో నటించలేదు. ఇంతకీ ఐశ్వర్య నటించాలనుకున్న మూవీ ఎంటంటే?

preminchukundam raa

సినీ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించే హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్(Venkatesh) పేరు చెబుతారు. యాక్షన్, ఎమోషన్ తో పాటు లవ్ చిత్రాల్లోనూ వెంకటేష్ అలరించారు. అయితే వెంకటేష్ కెరీర్లో ఎన్నో లవ్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో ‘ప్రేమించుకుందాం.. రా’ ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. అప్పటి వరకు వెంకటేష్ సినిమాలు ప్లాప్ అవుతుండగా ఈ మూవీతో మరోసారి స్టార్ డం వచ్చింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీని వెంకటేష్ అన్న సురేష్ బాబు నిర్మించారు.

venkey and aishwarya rai

ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. హీరోయిన్ గా అంజలా ఝువేరీ పరిచయం అయ్యారు. అప్పటి వరకు బాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ భామ వెంకటేష్ తో తొలి సినిమా తీశారు. అయితే ప్రేమించుకుందాం.. రా.. (Preminchukundam raa)సినిమా కోసం అంజలా ఝువేరీ కంటే ముందుగా ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారు. కానీ ఐశ్వర్య నటించిన రెండు చిత్రాలు అప్పటికే ఫ్లాప్ అయ్యాయి. అటు వెంకటేష్ సినిమాలు వరుస ప్లాపులతో ఉండడంతో సెంటిమెంట్ గా భావించి కొత్త హీరోయిన్ ను పట్టుకొచ్చారు.

venkaatesh

అనుకున్నట్లుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిట్టు మాత్రమే కొట్టకుండా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. వసూళ్లలో నెంబర్ వన్ గా నిలిచింది. వెంకటేష్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వచ్చినా చాలా మంది వీక్షిస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాతో పరిచయం అవుతారనుకున్న ఐశ్వర్యకు.. ఆ తరువాత కూడా మరే సినిమాల్లో ఛాన్స్ రాలేదు. అయితే తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్ మంచి సక్సెస్ ను అందుకుంది.

1319 views