DASARA:బ్లాక్ బస్టర్ దసరా సినిమాను చేతులారా వదిలేసినా స్టార్ హీరో ఎవరో తెలుసా

Posted by venditeravaartha, April 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మార్చి 30 న వచ్చిన నాని ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 100 కోట్ల క్లబ్ చేరేందుకు అతి దగ్గర లో ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా కూడా దసరా గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయినా ఈ సినిమా అంచనాలు కొంత తలకిందులు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు నుంచి వస్తున్న టాక్ తో చిత్రం యూనిట్ కూడా సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ సినిమాలో నటించిన నాని మరియు కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినట్టుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

అయితే ఇంత మంచి సినిమా కథ ముందుగా నాని దగ్గరికి వెళ్లలేదు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఒక్క సినిమా చేస్తే చాలు అనుకోని హీరో ఉండరు. సుకుమార్ శిష్యుడుగా ఉన్న శ్రీకాంత్ ఓదెల ఈ కథకు మొదటగా రామ్ చరణ్ అయితే బాగుంటుందని అనుకున్నాడట. కానీ సినిమా కథ పూర్తి చేసుకున్న తర్వాత అంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలనా లేదా అని అనుమానం వచ్చి రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి కథ చెప్పలేదట. ఇక తెలంగాణ ప్రాంతీయ చిత్రంగా ఉన్నటువంటి ఈ కథను ఏ హీరో తీస్తే బాగుంటుంది అని అనుమానం శ్రీకాంత్ ఓదెలను బాగా పట్టుకుందట.

తెలంగాణ హీరో అయితే తెలంగాణ నేపథ్యమున్న కథకు న్యాయం చేస్తాడని హీరో నితిన్ కలిసి కథ చెప్పాడట. కానీ ఒక కొత్త దర్శకుడు చేతిలో ఉన్న తెలంగాణ కథ ఎలా ఉంటుందో అని అనుమానంతో ఈ కథను రిజెక్ట్ చేశాడట నితిన్. దాంతో శ్రీకాంత్ నానిని అడిగాడట. ప్రోమో ఒకటి చేయించుకుని తీసుకొని రమ్మన్నాడట. అది చూడగానే వెంటనే ఓకే చెప్పేసాడట నాని. ఇక సినిమా విడుదలైన తర్వాత నాని తప్ప మరొక హీరో దసరా సినిమాకి న్యాయం చేయలేడు అన్న విధంగా బాగా సెట్ అయ్యాడు. ప్రస్తుతం దసరా మిలియన్ మార్క్ దాటి రికార్డు కలెక్షన్స్ అందుకుంటుంది దసరా చిత్రం.ఇద్దరు స్టార్ లు నాని ,కీర్తి సురేష్ ల ను డైరెక్టర్ వాళ్ళు జీవితం అంత గుర్తు ఉండిపోయే సినిమా ను ఇచ్చాడు.ఈ సినిమా నిర్మాత డైరెక్టర్ శ్రీకాంత్ కు 80 లక్షల విలువ అయినా BMW కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అని సమాచారం.

458 views