DASARA:దసరా మొదటి రోజు కలెక్షన్స్

Posted by venditeravaartha, March 31, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

న్యాచురల్ స్టార్ నాని ,కీర్తి సురేష్ తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ల తో నటించిన దసరా మూవీ 30 మార్చ్ 2023 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది ,శ్రీకాంత్ డైరెక్షన్,మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ సినిమా కి మరో ప్లస్ . ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది,నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా గా రిలీజ్ అయింది.51 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయినా దసరా మొదటి రోజు ఎంత కలెక్షన్ సాధించిందో చూద్దాం?

2023 లో రిలీజ్ అయినా తెలుగు సినిమా ల లో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది దసరా ,మొదటి ప్లేస్ లో వీరసింహారెడ్డి ,రెండవ ప్లేస్ లో వాల్తేర్ వీరయ్య ఉండగా మూడవ స్థానం లో నాని దసరా మూవీ ఉంది.వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ల లో 34 కోట్ల రూపాయల షేర్ ని సాధించింది,ఆంధ్ర ,తెలంగాణా ల లో 24 కోట్ల కలెక్షన్ ,ఓవర్సీస్ లో 8 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి.ఓవరాల్ గా 18 నుంచి 20 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ఈ సినిమా కి మొదటి రోజు వచ్చాయి,అంటే దాదాపు గా 40 % రికవరీ ని మొదటి నుంచే సాధించింది.ఇక రానున్న 2 రోజుల లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది.

దసరా 1st డే కలెక్షన్:
వరల్డ్ వైడ్ గ్రాస్ :35 -38 కోట్లు
ఆంధ్ర ,తెలంగాణ :24 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా :5 కోట్లు
ఓవర్సీస్ :6 కోట్లు
దసరా మూవీ ప్రపంచ వ్యాప్తముగా 3000 కి పైన థియేటర్ ల లో రిలీజ్ కావడం ,దానికి సరైన పోటీ లేకపోవడం ,విపరీతమైన పాజిటివ్ టాక్ ఉండటం తో నాని కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది అనడం లో సందేహమేది లేదు.టైర్ 2 హీరో ల లో 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరో లు అయినా విజయ్ దేవరకొండ ,నిఖిల్ సరసన చేరనున్నారు.

552 views