Bimbisara: బింబిసార 2 నుంచి క్రేజీ అప్డేట్ !

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కళ్యాణ్ రామ్(Kalyan ram) గారి కెరీర్ లో సరైన కం బ్యాక్ ఫిలిం గా చెప్పుకునే సినిమా బింబిసారా గత ఏడాది ఆగస్టు 5 న రిలీజ్ అయి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ ల ను రాబట్టింది.పటాస్ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూసిన తనకి నూతన దర్శకుడు వశిష్ఠ తో బింబిసారా(Bimbisara) చేసి కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.క్రీస్తు పూర్వం 500 ల లో జరిగిన కథ ని ఇప్పటి కి సింక్ చేసి తీసిన బింబిసారా ప్రేక్షకులకి బాగా నచ్చింది.సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 ఉంటుంధి అని హింట్ ఇచ్చిన టీం.ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

bimbisara
వశిష్ట దర్శకత్వం వహించిన ఫిక్షన్ పీరియడ్ ఎంటర్‌టైనర్ కళ్యాణ్ రామ్‌ని పూర్తిగా డిఫరెంట్‌గా చూపించింది. కళ్యాణ్ రామ్ నటన, ఎక్స్‌ప్రెషన్స్, మ్యానరిజమ్స్ అందరి మన్ననలు పొందాయి.అప్పటి నుండి అందరి దృష్టి బింబిసార 2 పైనే ఉంది. అయితే, కళ్యాణ్ రామ్ తన రాబోయే ప్రాజెక్ట్‌లు డెవిల్(Devil) మీద ఉన్నాడు.ఇక తన డెవిల్ సినిమా పూర్తికాగానే కళ్యాణ్ రామ్ బింబిసారా 2 మీద ఫోకస్ చేయనున్నాడు.

devil

ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా డిస్నీ+హాట్‌స్టార్ ఈ ప్రాజెక్ట్ కోసం కళ్యాణ్ రామ్ యొక్క ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి పనిచేస్తుందని నివేదికలు వస్తున్నాయి.బింబిసారా 2 కి బడ్జెట్‌ను పెంచనున్నారు.వశిష్ఠ ప్రస్తుతం స్క్రిప్ట్ ని పూర్తి చేసే పని లో ఉండగా, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది అని సమాచారం.

 

1617 views