Allu arjun: స్నేహరెడ్డిని పెళ్లి చేసుకోవడం బన్నీ తల్లికి ఇష్టం లేదా?

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆయన నటించిన ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో బన్నీ పేరే దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తూ త్వరలో థియేటర్లోకి రాబోతున్నాడు. మిగతా హీరోల్లాగే బన్నీ కూడా తన పర్సనల్ విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈక్రమంలో ఆయన వైఫ్ స్నేహ రెడ్డి గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటో చూద్దాం.

sneha

అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల కిందట స్నేహ రెడ్డి(Sneha reddy) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బన్నితో పాటు ఈమె కూడా సెలబ్రెటీనే అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు బన్నితో పాటు.. పర్సనల్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. వీరిద్దరిది అరేంజ్ మ్యారేజ్ అయినా.. లవ్ కపుల్స్ లా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే స్నేహిత అంటే అల్లు అర్జున్ కు ఎంతో ఇష్టం. కానీ బన్నీ మదర్ కు మాత్రం ఆమె అంటే ఇష్టం లేదని కొందరు అంటున్నారు.

allu

సాధారణంగా ఏ ఇంట్లో అయినా అత్తా కోడళ్లు కాస్త వ్యతిరేకంగానే ఉంటారు. ఇంటి బాధ్యతల విషయంలో మనస్పర్థలు వచ్చి ఒకరుకొకరు పోటీ పడుతూ ఉంటారు. అయితే బన్నీ మదర్, సతీమణి స్నేహ రెడ్డి లు కూడా ఇదే విషయంలో మనస్పర్థలు వచ్చాయా? అని కొందరు పోస్టులు పెట్టారు. అయితే దీనిపై మరికొందరు క్లారిటీ ఇచ్చారు. అదేం కాదు.. ప్రస్తుతానికి వీరు ఎంతో సంతోషంగా కలిసి మెలిసి ఉంటారు.. ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అని చెప్పారు.

allu family

అయితే బన్నీ పెళ్లి చేసుకునే సమయంలో మాత్రం ఓ సీన్ జరిగిందట. వాస్తవానికి బన్నీ కోసం తన బంధువుల్లో ఒకరుతో పెళ్లి చేయాలని ఆమె తల్లి డిసైడ్ అయిందట. అయితే అల్లు అర్జున్ ఆ సమయంలో సినిమాలతో బిజీగా ఉండడంతో లైఫ్లో సెటిల్ అయ్యాక ఆ విషయం అడగాలని అనుకుందట. కానీ ఇంతలో బన్నీ స్నేహ రెడ్డిని చూసి మనసు పారేసుకున్నాడు. అయితే తన తల్లి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిందట. కానీ బన్నీ మాత్రం స్నేహిత రెడ్డిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు.

allu sneha

దీంతో చేసేదేమీ లేక ఆయన తల్లి కూడా స్నేహ రెడ్డికి ఓకే చెప్పిందట. మొదట్లో తనకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా.. సర్దుకున్నారు. కానీ ఆ తరువాత స్నేహిత రెడ్డి మనస్తత్వం తెలిశాక ఆమెతో ఎంతో కలివిడిగా ఉంటున్నారు. ఓ సందర్భంలో ఆమె తల్లి మరొకరితో చర్చించగా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో బన్నీకి స్నేహిత రెడ్డి అంటే ఎంత ఇష్టమో అర్థమైంది.. అని అంటున్నారు.

1922 views