Pawan kalyan: రిలీజ్ కు ముందే లాభాల పంట పండించిన ‘బ్రో’..

Posted by venditeravaartha, June 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్(Pawan kalyan) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది డైరెక్టర్లు పవన్ తో సినిమా తీయాలని అనుకుంటారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలోకి ఎందరో హీరోలు వచ్చినా.. పవన్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ ఆ తరువాత వరుస సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. లాస్ట్ మూవీ భీమ్లానాయక్ తరువాత పవన్ ఇప్పుడు దాదాపు నాలుగు సినిమాలతో బిజీగా మారారు. వీటీలో ‘బ్రో’కు సంబంధించి పిక్ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. ఈమూవీ గురించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

bro

పీపుల్స్ మీడియా బ్యానర్ పై సముద్రఖని(Samudrakhani) డైరెక్షన్లో వస్తున్న బ్రో(Bro) జూలై 28న థియేటర్లోకి వస్తుంది. దీంతో ఈ మూవీపై ఇప్పటి నుంచి రకరకాల అప్డేట్ ను రిలీజ్ చేశారు. పవన్ స్టైలిష్ గా ఉన్న ఓ పిక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలో సినిమా ఇప్పటికే లాభాల పంట పండిందని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు కేవలం 120 కోట్లు వెచ్చించారట. కానీ వీరికి ఇప్పటికే 175 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇందులో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపే ఉన్నాయి.

saitej

పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai dharam tej) కూడా నటిస్తున్న ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. అనేక ట్విస్టులతో సినిమా ఆకట్టుకుంటుదని అంటున్నారు. పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. కానీ బ్రో మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు కనిపించని విధంగా పవన్ ఇందులో కొత్తగా కనిపిస్తారని అంటున్నారు. పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత వరుస హిట్లు అందుకున్నాడు. ఇప్పుడీ మూవీ కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

pk and sdt

మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వహిస్తున్నారు. సముద్రఖని గతంలో శంభో శివ శంబో సినిమా తీసి హిట్టు కొట్టాడు. ఇప్పడు పవన్ సినిమాను తీయడంతో ఆయనపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీని తెలుగులోనే కాకుండా ఇతర లాంగ్వేజుల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అంటున్నారు.

662 views