Bro: బ్రో మూవీ రివ్యూ !

Posted by venditeravaartha, July 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ కలిసి నటించిన బ్రో మూవీ జులై 28 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది.తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయినా వినోదయ సీతం కి రీమేక్ ఏ బ్రో సినిమా,ఒరిజినల్ డైరెక్ట్ చేసిన సముద్రఖని గారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ,మాటలు అందించారు. కేతిక శర్మ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రోహిణి ,తనికెళ్ళ భరణి ,బ్రహ్మానందం గారు ప్రధాన పాత్రా లు చేసిన బ్రో సినిమా కి థమన్ మ్యూజిక్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,జీ స్టూడియోస్ కలిసి నిర్మించారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ ,ట్రైలర్ ల తో భారీ అంచనాలు సెట్ చేసిన బ్రో సినిమా ఆ అంచనాలను అందుకుందా ? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

bro

కథ:మార్క్(సాయి ధరమ్ తేజ్) టైం ని పట్టించుకోకుండా ఎప్పుడు తన బిజీ కార్యకలాపాలలో మునిగి పోయి ఉన్న ఒక బిజినెస్ మాన్,తన కంపెనీ లో బాధ్యతల ను తీసుకుని ఇంట్లో వాళ్ళకి సైతం టైం ఇవ్వలేని పరిస్థితి లో ఉంటాడు,తన లవర్ కి సైతం టైం ఇవ్వలేక ఆమెతో తిట్లు తింటూ ఉంటారు.ఇక అలాంటి సమయం లో ఒక పెద్ద ఆక్సిడెంట్ కి గురి అయ్యి చనిపోతాడు
చనిపోయిన తనకి టైం(పవన్ కళ్యాణ్) గారు పరిచయం అయినా తర్వాత మార్క్ కి మరొక అవకాశం ఇచ్చి తాను ఏది అయితే టైం మిస్ అయ్యాడో దానిని తిరిగి ఇస్తాడు.మార్క్ కి టైం ఇచ్చి తన తో పాటు ఉంటాను అని కండిషన్ మీద మార్క్ ని మరల బ్రతికిస్తాడు.మార్క్ తిరిగి ఇంటికి వెళ్ళాక వారి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ,అసలు మార్క్ కి టైం ఎందుకు ఇచ్చాడు.తిరిగి వచ్చిన టైం ని మార్క్ ఉపయోగించుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.

bro movie

విశ్లేషణ:ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సముద్రఖని చెప్పినట్లు తాను రాసుకున్న కథ కి త్రివిక్రమ్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లే ,మాటలు సినిమా ని మరొక స్థాయి కి తీసుకుని వెళ్ళాలి అనే చెప్పాలి.ముఖ్యం గా సెకండ్ హాఫ్ ,క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లు హైలైట్ అయ్యాయి
సాయి ధరమ్ తేజ్ ,పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్ ల ను డిజైన్ చేసిన విధానం,పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ కామెడీ అందరికి నచ్చుతుంది.మొదటగా రిలీజ్ అయినా సాంగ్స్ పెద్దగా హిట్ కాకపోయినా సినిమా లో ప్లస్ అయ్యాయి.థమన్ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెద్ద ప్లస్ అయింది.
పాజిటివ్:పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్ ,కామెడీ ,ఎమోషన్, క్లైమాక్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
నెగటివ్:స్లో నారేషన్ ,ఫస్ట్ హాఫ్.
రేటింగ్:3 .5 / 5

3719 views