NBK: అబ్బాయి ఫెయిల్..కనీసం బాబాయ్ అయినా ఖుషి రికార్డ్స్ ని బద్దులు కొడుతాడా.?

Posted by venditeravaartha, May 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రీ రిలీజ్ టాలీవుడ్ లో ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్..సినిమా రిజల్ట్ తో పని లేకుండా వారి ఫేవరేట్ హీరో ల సినిమా ల ని 4k ల లో రీ రిలీజ్ చేస్తున్నారు.అందులోను రీ రిలీజ్ ల కోసం
భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటీవల కాలం లో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కి రిలీజ్ అయిన సింహాద్రి(Simhadri) కోసం దాదాపు 5 కోట్ల మేర పబ్లిసిటీ కోసం ఖర్చు చేసారు అంటే ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ ఏ స్థాయి లో ఉందొ అర్ధం అవుతుంది. రీ రిలీజ్ ల ట్రెండ్ ని మహేష్ బాబు పోకిరి తో స్టార్ట్ చేసి రికార్డు ల ను సృష్టించారు మహేష్ బాబు ఫాన్స్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భం గా రిలీజ్ చేసిన జల్సా(Jalsa) మామలు హంగామా చేయలేదు.రీ రిలీజ్ ల లో రికార్డు వసూళ్లను కలెక్ట్ చేసింది.

Ntr

ఈ సంవత్సరం జనవరి 1st కి పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయిన ఖుషి ని రీ రిలీజ్ చేసి అంతకముందు ఉన్న హైయెస్ట్ రీ రిలీజ్ కలెక్ట్ చేసిన జల్సా ని క్రాస్ చేసారు..ఇక ఇప్పుడు ఏ సినిమా రీ రిలీజ్ అయిన వాటి ముందు ఖుషి రీ రిలీజ్ పెద్ద సవాల్ గా మారింది.
ఇక అన్ని కోట్ల పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసిన సింహాద్రి మూవీ ఖుషి(Khushi)  ని క్రాస్ చేయలేకపోయింది ఇప్పుడు ఆ రికార్డు ని బ్రేక్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అయిన బాలకృష్ణ గారు బరిలోకి దిగనున్నారు.

narasimha naidu

జూన్ 10 న నందమూరి బాలకృష్ణ(Balakrishna) గారి పుట్టినరోజు ఆ సందర్బముగా ఇండస్ట్రీ హిట్ నరసింహ నాయుడు(Narasimha naidu) సినిమా ని రీ రిలీజ్ చేయనున్నారు.2001 జనవరి 11 న రిలీజ్ అయిన నరసింహనాయుడు బాలకృష్ణ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది ,ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ లో వచ్చే ట్రైన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారి మృగరాజు సినిమా తో పోటీగా ఒకే రోజు రిలీజ్ అయిన నరసింహనాయుడు మొదట 3 రోజులు కొంచెం నెమ్మదిగా కలెక్షన్ స్టార్ట్ అయి ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ సినిమా రిలీజ్ అయి 22 సంవత్సరాలు అవుతున్న సినిమా కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇటీవల చెన్నకేశవ రెడ్డి ని కూడా రీ రిలీజ్ చేసారు..అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న నరసింహనాయుడు ని ఒక రేంజ్ లో రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.మరి ఈ రీ రిలీజ్ తో అయిన పవన్ కళ్యాణ్ ఖుషి కలెక్షన్స్ ని క్రాస్ చేస్తారేమో చూడాలి.

balaya pawan

674 views