BigBossTelugu7 : బుల్లి తెరపై బిగ్ బాస్ సీజన్ 7 కొనసాగుతోంది. అత్యధిక టీఆర్పీతో షో రసవత్తరంగా నడుస్తోంది. గత వారం ఊహించని విధంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో శోభ శెట్టి తెగ బాధ పడింది. నువ్వు లేకుండా ఎలా ఉండాలో అంటూ ఏడ్చేసింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 7 పదో వారం నామినేషన్లు చాలా సిల్లీగా జరిగాయి. పెద్దగా అరుచుకోవడాలు.. పోట్లాటలాంటి వేవీ లేవు. కానీ, ఒక్కొక్కరు తమ పాయింట్లు సైలెంట్ గా చెప్పి వెళ్లిపోయారు. ప్రియాంక, శోభా శెట్టి, అశ్విని, రాతిక రోజ్‌లు రాణులుగా వ్యవహరించారు.
నామినేట్ చేసే వ్యక్తులను వాళ్లే ఎంపిక చేశారు. దీంతో బిగ్ బాస్ పదోవారంలో మొత్తం ఐదు నామినేషన్లు వచ్చాయి. ఈ వారం నామినేషన్లలో భోలే, గౌతమ్ కృష్ణ, శివాజీ, ప్రిన్స్ యావర్, రతిక ఉన్నారు. నామినేషన్లు వేసిన సోమవారం (నవంబర్ 6) నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు ఓటింగ్ పోల్స్ నిర్వహించారు. ఈ ఏడవ సీజన్‌లో నామినేషన్లు రెండు రోజుల పాటు జరిగాయి. కానీ, ఈసారి ఒక్కరోజులోనే ముగిసింది. అయితే ఈ పదో వారం ఓటింగ్ గణాంకాలు ఓ రకంగా షాకింగ్ గా అనిపించాయి.
హీరో శివాజీ నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ తానే హౌస్ లో ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈసారి కూడా శివాజీ 37.78 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచారు. ఓటింగ్‌లో శివాజీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారనే విషయం బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ తెలిసిందే. రెండో స్థానంలో హౌస్‌లో చెత్త కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రతికా రోజ్ ఈ వారం 16.5 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉంది. బహుశా పల్లవి ప్రశాంత్ ఓట్స్ కూడా ఆమె పడ్డట్లు అనిపిస్తోంది. సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న ప్రిన్స్ యావర్ 15.43 శాతంతో మూడవ స్థానంలో ఉన్నారు.
భోలే, డాక్టర్ గౌతమ్ కృష్ణ వరుసగా చివరి ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. భోలేకు 15.3 శాతం ఓట్లు రాగా, గౌతమ్‌కు 14.98 శాతం ఓట్లు వచ్చాయి. అంటే హౌస్‌లో జెన్యూన్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. వారం మొత్తం ఇదే కొనసాగితే.. గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. సింగర్ భోలేను సేవ్ చేయడానికి సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ వారం ప్రిన్స్ యావర్, గౌతమ్ ఇద్దరూ ఇంటికి వెళ్లనున్నట్లు టాక్.