Bhola shankar: భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత తమిళ్ స్టార్ డైరెక్టర్ వైపు చిరు చూపు !

Posted by venditeravaartha, August 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ ,స్థాయి ఏంటో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు, ఆయన కెరీర్ లో చూడని సక్సెస్ ,బద్దలు కొట్టని రికార్డు లు లేవు అనడం సందేహమే లేదు,కానీ ఆయన రాజకీయాల లో వెళ్లి తిరిగి సినిమా ల లో కి వచ్చి చేసిన సినిమా ల లో ఒకటి రెండు మినహా మిగిలిన సినిమా లు అటు అభిమానుల ని ,నిర్మాతల ని నిరాశ పరిచాయి.ఇక ఇటీవల రిలీజ్ అయినా భోళా శంకర్ సినిమా రిలీజ్ అయినా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తో చిరంజీవి గారి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఆగష్టు 11 న రిలీజ్ అయినా సినిమా కి రజినీకాంత్ గారి జైలర్ సినిమా తో పెద్ద కష్టమే వచ్చింది అనుకోవాలి.

bhola shankarతన రీ ఎంట్రీ తర్వాత చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా కలెక్షన్ లు మంచిగానే రాబట్టిన చిరు రేంజ్ హిట్ అయితే దక్కలేదు అనేది నిజం ,ఇక ఆ సినిమా తరువాత భారీ బడ్జెట్ తో చేసిన సైరా నరసింహారెడ్డి కూడా యావరేజ్ గానే మిగిలింది.ఇక రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య మూవీ ఆయన కెరీర్ లో భారీ డిజాస్టర్ గా అయింది.ఆచార్య తర్వాత చిరంజీవి గారు
గాడ్ ఫాదర్ ,వాల్తేర్ వీరయ్య ,భోళా శంకర్ సినిమా ల ను కమిట్ అయ్యారు.అయితే గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ కావడం సినిమా బాగున్నప్పటికీ కూడా కలెక్షన్స్ రాణించకపోవడాం తో కంగారు పడిన మెగాస్టార్ కి ఈ సంవత్సరం రిలీజ్ అయినా వాల్తేర్ వీరయ్య తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా 200 కోట్ల పైన కలెక్షన్ సాధించారు.

chiru murugudasవాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత రీమేక్ సినిమా లు చేయను అని చెప్పిన మెగాస్టార్ తాను ఇది వరకే కమిట్ అయినా సినిమా కావడం తో భోళా శంకర్ ని పూర్తి చేసారు.వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత రిలీజ్ అయినా సినిమా కావడం తో భారీ అంచనాల తో ఉన్న ఫాన్స్ కి మెహర్ రమేష్ గారు భారీ షాక్ నే ఇచ్చారు.తనకి తెలుగు లో హిట్ రాదు అని డైరెక్ట్ గానే చెప్తున్నట్లు సినిమా చేసి చిరంజీవి గారికి ఆచార్య ని మించిన డిజాస్టర్ ని ఇచ్చారు.ఇక ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో కంగారు లో ఉన్న చిరంజీవి గారు తన తదుపరి చిత్రం కోసం తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ తో చేయనున్నారు అని సమాచారం,ఇక సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ని సంగీత దర్శకుడు గా చేయనున్నారు.ఇక ఈ సినిమా తో అయినా చిరు సూపర్ కం బ్యాక్ ఇవ్వాలి అని కోరుకుందాం.

1304 views