తెలుగు సినీ ఇండస్ట్రీ లో నందమూరి తారక రామారావు(Sr.Ntr) గారి గురించి మాట్లాడకుండా ఉండని వారు ఎవరు ఉండరు.92 సంవత్సరాల తెలుగు సినీ చరిత్ర లో రామారావు గారి పాత్ర చాల ఉంది ఆయన సమకాలీనులు అయినా అక్కినేని నాగేశ్వర రావు(ANR) గారితో కలిసి తెలుగు సినిమా కీర్తి ని నలు వైపులా విస్తరించారు.మే 28 1923 న పుట్టిన రామారావు గారు తెలుగు దేశం పార్టీ(TDP) ని పెట్టిన 9 నెలలే కి అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్టించాడు.ఆయన శతజయంతి సందర్భముగా ఉత్సవాల నిర్వహణ లో భాగం గా మే 20 న ఆయన పుస్తకం ని ఆవిర్భవించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల అందరికి ఇన్విటేషన్ పంపారు..టాలీవుడ్ స్టార్ హీరో లు అయినా పవన్ కళ్యాణ్(Pawan kalyan),ప్రభాస్(Prabhas),అల్లు అర్జున్(Allu arjun), జూనియర్ ఎన్టీఆర్(ntr),రామ్ చరణ్(Ram charan) మొదలగు వారందరికీ పంపారు.కానీ వారిలో ఒక్క రామ్ చరణ్ మాత్రమే హాజరు అయ్యారు.మొదట నుంచి తనకి తాత గారు అంటే చాల ఇష్టం అని ,ఆయన పెట్టిన తెలుగు దేశం పార్టీ అంటే గౌరవం ఉంది అని చెప్తూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నిన్న డుమ్మా కొట్టడం ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది ఒక వాదన..అయితే మొదటి నుంచి మెగా ఫ్యామిలీ కి నందమూరి ఫ్యామిలీ కి సినిమా ల లో తెలియని వైర్యం ఉంది..అప్పట్లో రామ్ చరణ్ గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి.
గత కొంత కాలం నుంచి బాలకృష్ణ(Balakrishna) మెగా ఫ్యామిలీ కి దగ్గరగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ఆహా లో బాలయ్య షో చేస్తుండటం తో పాటు గా చిరంజీవి ,పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు అనేది నిజం.నిన్న జరిగిన కార్యక్రం లో ఇది క్లియర్ గా అర్ధం అయింది.స్టేజి మీద ఎంత మంది ప్రముఖులు ఉన్నపటికీ రామ్ చరణ్ కి వచ్చిన అభినందనలు కానీ ఇంపార్టెన్స్ కానీ ఎవరికీ రాలేదు.ఒకప్పుడు రామ్ చరణ్ ని విమర్శించిన బాలయ్య బాబు ఇప్పుడు చరణ్ గురించి మాట్లాడుతూ ‘చిరంజీవి గారికి ఉన్న వ్యక్తిత్వం,మర్యాద లు అన్ని కూడా రామ్ చరణ్ లో ఉన్నాయి’ ప్రోగ్రాం కి పిలవగానే వచ్చి తన వ్యక్తిత్వం ఏంటో చూపించాడు కానీ మన వాళ్ళు అనుకున్న వారు మాత్రం ఏవో కారణాలు చెప్పి డుమ్మా కొట్టారు అని జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ని ఉద్దేశించి అన్నారు.