Allu family: అల్లు అరవింద్ కి భారీ షాక్ ఇచ్చిన అల్లు శిరీష్!

Posted by venditeravaartha, June 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల్లు రామలింగయ్య గారి లెగసీ ని అల్లు అరవింద్ గారు ముందుకు తీసుకుని పోతున్నారు.అయితే తాను భారీ ప్రొడక్షన్ కంపెనీ ని స్థాపించి సినిమా లు చేయగా తన పెద్ద కొడుకు ఫిలిం మేకింగ్ ,గ్రాఫిక్ ల లో ఉండగా రెండవ కుమారుడు అల్లు అర్జున్ ప్రెసెంట్ ఇండస్ట్రీ లో టాప్ హీరో ల లో ఒకరు గా ఉన్నారు.ఇక మూడవ కుమారుడు అయినా అల్లు శిరీష్ 2013 లో గౌరవం సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు తన 10 సంవత్సరాల సినీ కెరీర్ లో కేవలం 6 సినిమా ల లో నటించారు.అయితే శ్రీరస్తు శుభమస్తు సినిమా మినహా మిగిలిన సినిమా లు అన్ని కూడా నిరాశపరిచాయి.

sirish

సినీ కెరీర్ లో సక్సెస్ కావలేకపోయిన అల్లు శిరీష్  బిజినెస్ వైపు మొగ్గు చూపించపోతున్నారు అని సమాచారం ఉంది.అయితే ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా ఉన్న శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని టాక్ ఉంది.ఈ మధ్య నే మెగా ఫ్యామిలీ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ ,లావణ్య త్రిపాఠి లు నిచ్చితార్ధం చేసుకున్నారు.అల్లు శిరీష్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూతురి తో అల్లు శిరీష్(Allu sirish) వివాహం ఫిక్స్ అయింది అని సమాచారం.అయితే శిరీష్ మరొక అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నాడు అని ఆ అమ్మాయి నే చేసుకుంటాడు అని మరొక న్యూస్. ఆ అమ్మాయి ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ అయినా ‘అను ఇమ్మానుయేల్’.

sirish

2016 లో నాని మజ్ను ద్వారా తెలుగు సినిమా కి పరిచయం అయినా అను ఇమ్మానుయేల్(Anu immanual) అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ ,గోపి చంద్ వంటి స్టార్స్ తో పని చేసిన ఈమె..2022 లో శిరీష్ తో ఉర్వశివో రాక్షసి వో సినిమా లో చేసారు ఈ సినిమా కి ముందు నుంచే వీరి మధ్య లవ్ నడుస్తుంది అని బయట ప్రచారం జరిగింది ఈ సినిమా తో అది కంఫర్మ్ చేసారు.రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఇందులో వీరు చాల బోల్డ్ గా నటించారు.ఈ సినిమా తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి.కానీ అవి కేవలం పుకార్లు అని అప్పట్లో కొట్టేసారు.కానీ ఇప్పుడు అను ఇమ్మానుయేల్ తోనే తన పెళ్లి అంటూ జోరు గా ప్రచారం జరుగుతుంది.పక్కా కమర్షియల్ గా ఆలోచించే అరవింద్ ఈ పెళ్లి కి ఒప్పుకొంటారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.

allu sirish

976 views