ALLU-MEGA:కేవలం స్టార్ డాం కోసం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి దూరం అవుతున్నారా ???

Posted by venditeravaartha, April 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రస్తుత తెలుగు సినిమా ని జాతీయ స్థాయి లో నిలబెడుతున్న రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,మెగా ఫ్యామిలీ లేగెసీ ని ముందుకు తీసుకుని పోతున్నారు,అయితే గత కొంత కాలం నుంచి అల్లు అర్జున్ ,మెగా ఫ్యామిలీ నుంచి దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే ,చాల మంది సినీ క్రిటిక్స్ ఈ విషయం మీద మాట్లాడుతూ అల్లు అర్జున్ తన కంటూ ప్రత్యకమైన గుర్తింపు కోసం మెగా ఫ్యామిలీ నుంచి దూరం ఉంటున్నారు అనే వారు ,కానీ ఈ మధ్య కాలం లో జరిగిన కొన్ని విషయాలు అసలు కారణం అది కాదు అనే చెప్తున్నాయి.

అల్లు ఫ్యామిలీ ,మెగా ఫ్యామిలీ కి ఉన్న బంధం ఇప్పటిది కాదు ,చిరంజీవి గారు ,అల్లు రామలింగయ్య గారి కి అల్లుడు అయినప్పటి నుంచి వారి మధ్య బంధం చాల బలపడింది,అల్లు అరవింద్ నిర్మాత గా చిరంజీవి గారి తో పదుల సంఖ్యల లో బ్లాక్ బస్టర్ సినిమా లు తీసి సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ రేంజ్ కి ఎదగడం లో అల్లు ఫ్యామిలీ సపోర్ట్ మరువలేనిది,అయితే అల్లు అరవింద్ ,అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీ లో ఎంత ఎదిగిన వారికి మెగాఫ్యామిలీ అనే టాగ్ ఉంటూనే ఉండేది.అల్లు అర్జున్ కూడా చాల సందర్భాల లో తనకి చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ఫాన్స్ అండ ఉండటం వలెనే తాను ఈ స్థాయికి వచ్చాను అనే వాడు.

ఏప్రిల్ 8 నా అల్లు అర్జున్ బర్త్ డే రోజు చరణ్ ,చిరంజీవి ,సాయి తేజ్ ,వరుణ్ తేజ్ సహా అందరు బన్నీ కి విషెస్ చేప్పారు.ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే సినిమా ప్రమోషన్ ల కోసం దసరా ,శాకుంతలం లాంటి వాటికీ ట్వీట్ చేసిన బన్నీ ,చరణ్ బర్త్ డే కి ట్వీట్ చేయకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి ? అల్లు అరవింద్ ,చిరంజీవి కి మధ్య ఉన్న సంబంధం అల్లు అర్జున్ ,చరణ్ మధ్య లేకపోవడానికి కారణం కేవలం ‘స్టార్ డాం ‘ ఏ అని అంటున్నారు. అల్లు అర్జున్ లెజెండరీ కమెడియన్ ,లెజెండరీ నిర్మాత అయినా అల్లు రామలింగయ్య ,అల్లు అరవింద్ ల పేరు నిలబెట్టడం కోసం సెపెరేట్ గా ఉండటం లో తప్పు లేదు ,కానీ అదే సమయం లో తన కి ఇంత స్థాయి రావడానికి కారణమైన మెగా ఫ్యామిలీ నుంచి దూరం గా ఉండటం కూడా తనకి మంచిది కాదు అనేది బయట టాక్.

490 views