Allu Arjun:సీఎం జగన్ ‘విజన్ వైజాగ్’ కి మద్దతుగా అల్లు అర్జున్ వైజాగ్ లో భారీ పెట్టుబడులు!

Posted by venditeravaartha, March 19, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ యాక్టింగ్ కెరీర్ తో పాటు బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే థియేటర్ బిజినెస్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవర కొండా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. తాజాగా ర‌వితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ కట్టబోతున్నట్టు సమాచారం.

ఇదిలావుంటే అల్లుఅర్జున్ కొత్తగా మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో AAA సినిమాస్ పేరుతో మల్టీ ప్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్.. తాజాగా మరో మల్టీ ప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ అది తెలంగాణాలో కాదు ఏపీలో అని తెలుస్తోంది. వైజాగ్ లో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఏషియన్ సంస్థతో కలిసి హైదరాబాద్ లో ఉన్నట్లే హై క్లాస్ స్టాండర్స్ తో ఈ థియేటర్ ను నిర్మించబోతున్నారని టాక్. ఇంకా దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వైజాగ్ ని రాష్ట్ర రాజధాని గా ప్రకటించి రాబొయ్యే రోజుల్లో తిరుగులేని శక్తిగా మలచడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన విజన్ వైజాగ్ ని నచ్చి అల్లు అర్జున్ ఇక్కడ మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజిబిజీగా ఉంటున్నాడు అర్లు అర్జున్. గతంలో రిలీజై పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప 1 సినిమాకు మించి క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

328 views