పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ సినిమా చూడడానికి వెళ్లిన ఒక కుటుంబం భారీ విషాదానికి చోటుచేసుకుంది అయితే ఈ సంఘటన హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగింది ఈ థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రీమియర్ షో కి వచ్చారు అయితే ఈ క్రమంలోనే బన్నీని చూడాలని ఆయన అభిమానులు ఆయనను కోసం పరిగెత్తుకున్న వెళ్లే క్రమంలో రేవతి కూడా ఆయన చూసేందుకు పరిగెత్తుకుని వెళ్ళింది అయితే ఆ క్రమంలోనే ప్రేక్షకుల మధ్య పడిపోయి వారి కాళ్లతో కింద ఉండిపోయి ఊపిరి ఆడక ప్రాణాలను విడిచిపెట్టింది రేవతి తిని కాకుండా తన కొడుకు అయినటువంటి శ్రీ తేజ కూడా స్వల్ప గాయాలు అయ్యి స్పృహ కోల్పోవడం అనేది జరిగింది
వీరిద్దరే కాకుండా ఆ సంఘటనలో అనేకమంది గాయాలకు గురయ్యారు అలా గురైన క్రమంలోనే రేవతి భారీ దెబ్బలతో గాయపడి ప్రాణాలను విడిచిపెట్టింది ఆ ప్రదేశంలో ఆ విధంగా జరగడం వల్ల ఒక కుటుంబాన్ని విషాదం చోటు చేసుకుంది అంతేకాకుండా ఒక కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగించింది పుష్పట్టు ఒక బిడ్డకి తల్లి లేకుండా ఒక కుటుంబానికి వెలుగు లేకుండా తీవ్ర విషా దానికి చోటుచేసుకుంది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ సంఘటన గురించి పుష్పా టీం మొత్తం స్టైలిష్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ తో సహా జరిగిన సంఘటనకు పశ్చాతాప పడుతున్నారు ఎవరు ఊహించిన రీతిలో ఈ సంఘటన జరగడంతో ఈ సినిమా టీం మొత్తం నిరాశకు గురి చేసింది తీరని లోటుకు చోటుచేసుకుంది ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆమె ప్రాణాలను వెనక్కి తీసుకురాలేమంటూ విషాదానికి చోటు చేసుకున్న అంటూ వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుంటున్నారు
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సంఘటనకు స్పందించడం జరిగింది సినిమా సూపర్ హిట్ అయితే నిర్మాతలు దర్శకులు హీరోలు అందరూ సక్సెస్ పార్టీ చేసుకుంటారు కానీ ఇక్కడ పుష్పట్టు సూపర్ హిట్ అయినప్పటికీ కూడా సినిమా బృందమంతా దుఃఖానికి గురవుతున్నారు ఎందుకంటే ఆ క్రమంలో ఒక నిండు ప్రాణం తీశారని తమ బాధను వ్యక్తం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధగా గురిచేస్తుందంటూ స్టైలిష్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో రేవతికి ఆ విధంగా జరగడం అనేది అల్లు అర్జున్ ని చాలా కృంగతీసినట్లుగా అర్థమవుతుంది ఈ క్రమంలోనే తన చేసిన ప్రతి సినిమాను తన అభిమానులతో చూడడం అనేది అల్లు అర్జున్కి అలవాటుగా మారింది ఆ క్రమంలోని ఈ సినిమాను కూడా తన అభిమానులతో చూడాలని థియేటర్కు వచ్చాడు అల్లు అర్జున్ కానీ ఇలా ఎప్పుడు కూడా జరగలేదు అయితే ఈ సంఘటన తను కుమిలిపోతూ ఆ కుటుంబానికి ఆయన అండగా నిలుస్తానని ఆర్థికంగా సహాయం చేస్తానని ఆ కుటుంబానికి తోడుగా నిలుస్తానని అంటూ మాటిచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
అంతేకాకుండా ఆ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని కల్పిస్తున్నాడు అల్లు అర్జున్ అంతేకాకుండా గాయపడిన అక్కడ వాళ్ళందరికీ కూడా తన ఖర్చులన్నీ భరిస్తానని తెలియజేశారు అంతేకాకుండా శ్రీ తేజ కైనటువంటి హాస్పిటల్ ఖర్చును తన భవిష్యత్తు కోసం కూడా బన్నీ తన వంతు సహాయం చేస్తానంటూ మాట ఇచ్చారు దీనికోసం అల్లు అర్జున్ ఏం చేయడానికి అయినా వెనకాడనంటూ మాట్లాడారు ఎందుకంటే పోయిన ప్రాణాన్ని అంటే తీసుకురాలేము ఎంత ఖర్చయినప్పటికీ నేను భరిస్తాను అంటూ మాట ఇచ్చాడు అంతేకాదు వారి బాధ్యత మొత్తం పుష్పటుకి మొత్తం భరిస్తుంది అంటూ వెల్లడించారు అంతేకాదు ఈ విధంగా మాట్లాడుతూ సినిమా చూసేందుకు వచ్చిన మీరందరూ సురక్షితంగా క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్తే అదే మాకు పట్టరానంత ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ వెల్లడించారు ఈ సంఘటన వల్ల అల్లు అర్జున్ మీద ఆ సినిమా బృందం మీద పోలీసులు కేసు అనేది నమోదు చేయడం జరిగింది