Aishwarya rajesh: తెలుగు హీరోయిన్ లు అంటే మన డైరెక్టర్స్ కి ఎందుకో అంత చులకన: ఐశ్వర్య రాజేష్

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో సక్సెస్ అయినా హీరోయిన్ ల లో చాల వరకు అందరు హిందీ ,తమిళ ,మలయాళ హీరోయిన్ లు ఏ ఉన్నారు,అంటే మన తెలుగు లో టాలెంట్ ,అందం ఉన్న హీరోయిన్ లు లేక బయట బాషల నుంచి హీరోయిన్ ల ని తీసుకుని వస్తున్నారా అనేది చాల సంవత్సరాల నుంచి వస్తున్నా వాదన ,అప్పట్లో సావిత్రి గారు ,జమున,వాణిశ్రీ ,భానుమతి ,కాంచన ,కన్నాంబ వంటి వారే మన తెలుగు సినిమా ల లో హీరోయిన్ ల గా చేసే వారు.కానీ ఇప్పుడు అలా లేదు హీరో తెలుగు వారు అయి ఉంటారు హీరోయిన్ మాత్రం బయట నుంచి వస్తారు.అలా అని మన తెలుగు హీరోయిన్ ల కి అవకాశాలు రావడం లేదా అంటే వస్తున్నాయి చిన్న సినిమా ల లో లేక పోతే రెండవ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి.

మన తెలుగు హీరోయిన్ లు అయినా కలర్స్ స్వాతి ,ఆనంది,ఐశ్వర్య రాజేష్ లాంటి వారు తెలుగు సినిమా ల లో కంటే తమిళ ,మలయాళ సినిమా లో బిజీ గా ఉన్నారు.వాళ్ళ దగ్గర అందం ,టాలెంట్ లేకపోతే అక్కడ రాణించలేరు కదా.ఇదే విషయం ని ఐశ్వర్య రాజేష్ దగ్గర ప్రస్తావించగా మీరు తెలుగు అమ్మాయే కదా తమిళ్ లో మీకు సూపర్ స్టార్ డాం ఉంది మంచి సినిమా లు చేస్తున్నారు మరి మీకు తెలుగు సినిమా ల లో ఎక్కువ అవకాశాలు ఎందుకు రావడం లేదు అని అడిగారు.

దానికి ఆమె సమాధానం ఇస్తూ నాకు అదే అర్ధం కాదు నేను తెలుగు అమ్మాయినే నాకు ఎందుకు ఇక్కడ పెద్ద అవకాశాలు రావు అంటే ఇక్కడ పెద్ద హీరో ల తో నటిస్తేనే పెద్ద హీరోయిన్ అంటారు కానీ తమిళ్ లో మంచి సినిమా లో నటిస్తే స్టార్ హీరోయిన్ అంటారు అని చెప్పారు.నేను తెలుగు లో చేసిన వరల్డ్ ఫెమస్ లవర్ లో సువర్ణ క్యారెక్టర్ కానీ టక్ జగదీష్ సినిమా లో క్యారెక్టర్ అలానే రిపబ్లిక్ సినిమా లో క్యారెక్టర్ చాల మంచివి అవి సక్సెస్ కాకపోవడం వలన నాకు వేరే అవకాశాలు రాలేదు.నాకు మాత్రం నేను చేసిన సినిమా లు తక్కువ ఉన్న కూడా మంచి పేరు వచ్చే సినిమా లు అయితే చాలు అంతే కానీ స్టార్ హీరో ల తో ,పెద్ద పెద్ద సినిమా లు చేయాలి అని నాకు లేదు.నా వరకు తమిళ్ సినిమా నే నాకు ఫస్ట్ ఛాయస్ తర్వాత నే తెలుగు సినిమా అని చెప్పారు.

900 views