Agent:ఏజెంట్ మూవీ రివ్యూ మీ కోసం !

Posted by venditeravaartha, April 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని నట వారసుడు గా అఖిల్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ‘అక్కినేని అఖిల్’ మొదటి సినిమా తో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు,ఇప్పటి వరకు రిలీజ్ అయినా ఒక్క సినిమా కూడా తనకి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ గా లభించలేదు,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కొంత వరకు మంచిగా ఆడినప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు ,అందువలన అఖిల్ ఎంతో కష్టపడి చేసిన సినిమా నే ‘ఏజెంట్’,సూపర్ టాలంటేడ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ అయిందా ? లేదా అని చూద్దాం.

కథ:రామకృష్ణ(అఖిల్) చిన్నప్పటి నుంచి ‘రా’ ఏజెంట్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు,కానీ తనకి ఉన్న చిన్న పాటి పొగరు ,కోపం వలన అందులో సక్సెస్ కాలేక ,ట్రై చేస్తూ ఉంటాడు,తన రోల్ మోడల్ అయినా ‘రా’ ఏజెన్సీ హెడ్ అయినా ‘మమ్ముట్టి'(డెవిల్ మహదేవన్) ని ఆదర్శం గా తీసుకుని ఆయనని మెప్పించడానికి ట్రై చేస్తున్న సమయం లో ‘వైద్య’ తో ప్రేమ లో పడతాడు, ‘రా’ కి దూరంగా ‘వైద్య ‘ తో ప్రేమ లో ఉన్న తరుణం లో ‘డెవిల్ మహదేవన్ ‘ రామకృష్ణ కి ఒక రిస్కీ మిషన్ ని అప్పగిస్తారు.అసలు అఖిల్ ‘రా ‘ లోకి ఎప్పుడు వెళ్ళాడు ,ఆ సీక్రెట్ మిషన్ ఏంటి ,దానిని హీరో పూర్తి చేశాడా లేడా అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:అఖిల్ తాను ఏజెంట్ కి ముందు నటించిన సినిమా లు అన్ని కూడా ‘లవర్ బాయ్ ‘ ఇమేజ్ ఉన్న సినిమా లు ,సినిమా స్టోరీ లు బావున్నప్పటికీ సరిగా ఆడలేదు .అందుకే ఏమో అన్నట్లు ఈ సినిమా లో అఖిల్ వైల్డ్ ఏజెంట్ గా మారిపోయారు.సురేందర్ రెడ్డి సినిమా లో కేవలం అఖిల్ మీద మాత్రమే ఫోకస్ చేసినట్లు ఉంటుంది.ఈ సారి ఇలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసి మీద అఖిల్ ,ఈ సినిమా లో తన ని అన్ని వైపులా నుంచి స్ట్రాంగ్ గా చూపించారు లవ్ సీన్ లు అయినా ,యాక్షన్ సీన్ లు అయినా అఖిల్ తన ట్రేడ్ మార్క్ స్టైల్ కనబరిచారు
ఏజెంట్ లాంటి సినిమా లు ఇంతకముందు చూసినట్లు అనిపించినా ‘అఖిల్ ‘ ఎనర్జీ ఆ ఫీల్ ని దూరం చేస్తుంది.’రా’ హెడ్ గా ‘మమ్ముటి’ గారు సూపర్బ్ గా చేసారు.ఆయనకి ఉన్న స్క్రీన్ షేరింగ్ కి ఇంకొంచెం మంచిగా చూపించి ఉంటె బావుండేది.హీరోయిన్ కేవలం సాంగ్స్ ల కోసమే అన్నట్లు ఉంది.సాంగ్స్ బావున్నపటికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సరిగా అందించలేదు.


పాజిటివ్:అఖిల్ ,యాక్షన్ సన్నివేశాలు,క్లైమాక్స్.
నెగటివ్:స్టోరీ ,స్క్రీన్ ప్లే ,బ్యాగ్రౌండ్ మ్యూజిక్,లాజిక్ లేని సీన్ లు.
రేటింగ్:2 .25 / 5
ఇక చివరిగా చెప్పాలంటే ఏజెంట్ మూవీ ‘అఖిల్’ కి బ్లాక్ బస్టర్ ని ఇవ్వలేదు.అఖిల్ కోసం ఒక సారి చూడొచ్చు.

751 views