Pawan kalyan: పవన్ కల్యాణ్ సినిమాకు చుక్కలు చూపిస్తున్న ‘ఈనగరానికి ఏమైంది’ అడ్వాన్స్ బుకింగ్..

Posted by venditeravaartha, June 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని కొన్ని సినిమాలను నిరూపించాయి. ఇటీవల ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘బలగం’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి. బలగం కంటే ముందు ఎన్నో చిన్న సినిమాలు మంచి హిట్టు కొట్టినవి ఉన్నాయి. వాటిలో ‘ఈ నగరానికి ఏమైంది?’. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. బాలకృష్ణ నరసింహానాయుడు ఇప్పటికే రీ రిలీస్ చేశారు. లేటేస్టుగా పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’(Tholiprema)ను 30న థియేటర్లోకి మరోసారి తీసుకొస్తున్నారు. అయితే మేమేం తక్కువ కాదని చిన్న సినిమాలు సైతం రీ రిలీజ్ అవుతున్నాయి. వీటీల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’(Ee nagaraniki emaindhi) సినిమాను మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమాకు ఈ నగరానికి ఏమైంది మూవీ షాక్ ఇస్తుంది. ఎలాగంటే?

viswak sen

నలుగురు కుర్రాళ్లు జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఎక్కువ శాతం కామెడీ, ఎమోషన్ ను జోడించి తీసిన ఈ మూవీ 2018 జూన్ 29న రిలీజ్ చేశారు. చిన్న బడ్జెట్ లో తీసిన ఈ సినిమా ఆ సమయంలో రూ.2 కోట్లు వసూలు చేసింది. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తీసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు.ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా బాధ్యతను తీసుకొని రిలీజ్ చేశారు.

ee nagaraniki emaindhi

ఆ సమయంలో ఎన్ని సినిమాలు ఉన్నా ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు షాక్ ఇచ్చింది. ఓటీటీలోనూ రిలీజై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ 29 జూన్ 2023న రిలీజ్ చేయనున్నారు. రీ రీలిజ్ ను ప్రకటించగానే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేవారు. ఇప్పటికే ఈ సినిమాకు అదిరిపోయే బుకింగ్స్ వచ్చాయి. అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు.

pawan kalyan

ఇదే రోజు పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ను రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో దాదాపు 300 థియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నారు. ఆ సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ గట్టిపోటీ ఇస్తుందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే రెండోసారి రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఈసారి ఎన్ని కోట్లు కొల్లగొడుతుందోనని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పుడు స్టార్ హీరోగా మారిన విశ్వక్ సేన్ నటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

1619 views