ALLU ARJUN:అల్లు అర్జున్ కావాలనే మెగాఫ్యామిలీ నుంచి దూరం అవుతున్నాడా ? బయటపడ్డ అసలు నిజం !

Posted by venditeravaartha, March 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా ఫ్యామిలీ లో ఎంత మంది హీరో లు ఉన్నపటికీ ‘రామ్ చరణ్ ‘ కి ఉన్న ప్రత్యేకత వేరు ,మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు అవడం ,అందులోను రెండవ సినిమా తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం తో మెగా ఫ్యామిలీ తో పాటు టాలీవుడ్ లోను రామ్ చరణ్ గారికి ప్రతేకత ఉంటుంది.చరణ్ తరవాత అంతే స్థాయి ఉన్న వ్యక్తి ‘అల్లు అర్జున్’, మొదటి సినిమా ‘గంగోత్రి ‘ కి అల్లు అరవింద్ గారి కొడుకు గా అంటే ‘చిరంజీవి ‘ గారి అల్లుడు గానే ఎంట్రీ ఇచ్చారు.మొదటి నుంచి మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ కలిసే ఉంటున్నారు ,ఎన్ని పనులు ఉన్నపటికీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ,ఫెస్టివల్స్ కి రెండు ఫ్యామిలీ లు కలుస్తారు.

అయితే గత కొంత కాలం నుంచి అల్లు ఫ్యామిలీ కి ,మెగా ఫ్యామిలీ మధ్య సరైన సంబంధాలు లేవని సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతూ వచ్చింది,సరైనోడు సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ‘ గురించి చెప్పను బ్రదర్ అన్నప్పటి నుండి గ్యాప్ ఉంది అనేది ఒక వాదన ,అయితే ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలిశారు ,జనసేన ఎన్నికల ప్రచారం లో కూడా అల్లు అర్జున్ పాల్గొన్నారు.అయితే వరుస విజయాలు రావడం తో అల్లు అర్జున్ సొంత ఇమేజ్ (మెగా ఫ్యామిలీ మెంబెర్ కాకుండా ) కోసం అల్లు ఆర్మీ అంటూ మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావించలేదు.

సోమ‌వారం రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్‌, బాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర‌ణ్‌కు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం రామ్‌చ‌ర‌ణ్‌కు విషెస్ చెప్పారు. అల్లు శిరీష్ కూడా రామ్‌చ‌ర‌ణ్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు అంద‌జేశారు,కానీ అల్లు అర్జున్‌ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్ట‌లేదు. దాంతో అల్లు అర్జున్ సెల్ఫీష్ స్టార్ అంటూ మెగా ఫ్యాన్స్ అత‌డిపై నెగెటివ్‌ కామెంట్స్ చేస్తోన్నారు. అంతే కాకుండా సినీ ప్ర‌ముఖుల కోసం చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి సోమ‌వారం త‌మ‌ ఇంట్లో స్పెష‌ల్ బ‌ర్త్‌డే పార్టీని ఏర్పాటుచేశారు. ఈ పార్టీకి రాజ‌మౌళి, వెంక‌టేష్‌, రానా, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా టాలీవుడ్ హీరోలు చాలా మంది హాజ‌ర‌య్యారు.

2 YEARS BACK ALLU ARJUN WISHED RAM CHARN ON HIS BIRTH DAY

కానీ ఈ వేడుక‌ల్లో బ‌న్నీ మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అత‌డు ఈ పార్టీకి హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ ప్ర‌జెంట్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లోనే ఉండి అత‌డు ఈ పార్టీకీ హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. కావాల‌నే రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్ డే పార్టీకి బ‌న్నీ దూరంగా ఉన్న‌ట్లు చెబుతోన్నారు, RRR సినిమా లో రామ్ చరణ్ యాక్టింగ్ కి ప్రపంచం అంత కీర్తించిన అల్లు అర్జున్ సరిగా రెస్పాండ్ కాలేదు ,2022 నుంచే అల్లు అర్జున్ కి ,మెగా ఫ్యామిలీ కి దూరం పెరిగినట్లు తెలుస్తుంది,గత సంవత్సరం చరణ్ ,పవన్ కళ్యాణ్ గారికి బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు అల్లు అర్జున్.మరి చరణ్ అంటే నాకు చాల ఇష్టం అని చెప్పుకునే అల్లు అర్జున్ మనసు లో తన మీద అసూయా ఉంది అని ఫాన్స్ మండిపడుతున్నారు.

2 YEARS BACK ALLU ARJUN WISHED PAWAN KALYAN ON HIS BIRTH DAY

795 views