2018: 2018 మూవీ రివ్యూ !

Posted by venditeravaartha, May 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మే 5 2023 న మలయాళం లో రిలీజ్ అయినా 2018 వ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల సునామి ని సృష్టించింది.ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూసి ఇప్పుడు 2018 ని తెలుగు లో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.దాదాపు 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన మలయాళ మూవీ 2018 కథ ఏంటి,అసలు సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ చదవండి .

2018

కథ:మరణానికి భయపడి అనూప్ (టోవినో థామస్) భారత సైన్యాన్ని విడిచిపెడతాడు,కేరళ లోనే తన ఇంటి దగ్గర నివసిస్తుంటారు.దుబాయ్‌లో ఐటీ ఉద్యోగి రమేష్ (వినీత్ శ్రీనివాసన్) భారతదేశంలోని తన భార్యతో సంబంధాల సమస్యలను ఎదుర్కొంటాడు మరియు తమిళనాడుకు చెందిన సేతుపతి (కళైరసన్) ట్రక్ డ్రైవర్‌గా పేలుడు పదార్థాలను కేరళకు రవాణా చేయడానికి అంగీకరిస్తాడు.మథాచన్ (లాల్) మరియు అతని కుమారుడు విన్‌స్టన్ (నరేన్) చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి పొందుతుండగా, కోశి (అజు వర్గీస్) పర్యాటకుల కోసం టాక్సీ నడుపుతాడు.ఎవరి జీవనం వారు సాఫీగా సాగిస్తుండగా ఒక్క సారిగా 2018లో వరదలు కేరళను ధ్వంసం చేస్తాయి , ఆ విపత్తు కేరళ ప్రజలపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ భారీ విపత్తును వారు ఎలా తట్టుకున్నారు? మరణ భయం తో సైన్యం నుంచి వచ్చేసిన అనూప్ మరియు మిగిలిన వారు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ప్రజలను ఎలా కాపాడారు అన్నదే మిగిలిన కథ.

2018 movie team

విశ్లేషణ:డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తాను ఏది అయితే కథ ని అనుకున్నాడో దానిని సూపర్ గా చూపించారు అనే చెప్పాలి.ఈ కథ యొక్క ముఖ్య సారాంశం మానవత్వం.ప్రత్యేకించి హీరో లు అంటూ ఎవరు లేకుండా కథ నే హీరో గా ఎంచుకున్నారు డైరెక్టర్.అందుకు తగ్గట్టుగా ఈ సినిమా లో నటించినవారు తమ పాత్రలకి జీవం పోశారు.కథతో పాటు, సినిమా యొక్క అద్భుతమైన కెమెరా పనితనం మరియు అసాధారణమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనకి తెలియని ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తాయి, ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నీవేశాలు ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ కి తీసుకుని వెళ్తాయి.దాదాపు అందరు కొత్త వారే కనిపించిన వారి నటన తో అబ్బురపరిచారు.2018 సినిమా ని ప్రతి ఒక్కరు థియేటర్ ల లో తప్పకుండా చూడాలి.

2018 movie

పాజిటివ్:కథ ,స్క్రీన్ ప్లే,ప్రధాన తారాగణం,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,సెకండ్ హాఫ్.
నెగటివ్:ఫస్ట్ హాఫ్.
రేటింగ్:4 / 5

 

443 views