నందమూరి తారకరత్న అంటే తెలియని వారు ఉండరు నందమూరి యంగ్ హీరోస్ లో పెద్దవారు తారకరత్న చేసినవి కొన్ని సినిమాలే అయిన సినీ ఇండస్ట్రీ లో ఆయనకు ఎటువంటి గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్ గా తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు అనే విషయం ఎంతో బాధాకరం తారకరత్న గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు విషయం తెలిసిందే. గుండెపోటుతో బెంగుళూరు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు దాదాపుగా 20 రోజుల వరకు వెంటిలేటర్ తో ఉన్నారు తన ఆరోగ్యం కుదుటపడి తిరిగి ఇంటికి వచ్చేస్తారు అని భావించిన కుటుంబ సభ్యులకు హఠాత్తుగా తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు అని తెలియగానే కుటుంబం కన్నీరుమున్నిరవుతుంది శివరాత్రి రోజున అనగా ఫిబ్రవరి 18న తారకరత్న తన తుది శ్వాస విడిచారు. దీనితో నందమూరి కుటుంబ సభ్యులలో విషాదం నింపుకుంది ఫిబ్రవరి 20న తారకరత్న దహన సంస్కరణలు జరిగాయి. రీసెంట్ గా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. తారకరత్న అమ్మ, నాన్న, చెల్లి, బాబాయ్, పెదనాన్నలు, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ అందరూ రావడం జరిగింది కుటుంబ సభ్యులే కాకుండా ఇండస్ట్రీ లో తారకరత్న సన్నిహితులు, కొందరు రాజకీయ వ్యక్తులు కూడా హాజరయ్యారు తారకరత్న ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు పుష్ప నివాళి అందించారు. అయితే అందరూ కళ్ళ ముందు కనిపిస్తుంటే తన భర్త ఫోటోలో కనిపిస్తున్నారు అని అలేఖ్య రెడ్డి కన్నీరు పెట్టుకుంది తనను ఓదార్చడానికి తన పెద్ద కూతురు నిషిక ప్రయత్నిస్తున్న వీడియో బయటికి వచ్చింది ఆ తల్లి కూతుర్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది వాళ్ళను చూసిన ఎవరైనా కంటతడి పెట్టుకోవాల్సిందే అలేఖ్య రెడ్డి తన భర్త పంచిన ప్రేమను గుర్తుతెచ్చుకుంటూ కూతుర్ని ఓదారుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది తారకరత్న గారి ఆత్మ కి శాంతి చేకూర్చాలని మనం కూడా ప్రార్థన చేద్దాం