RAM CHARAN:మరో డ్యూయల్ రోల్ చేయబోతున్న గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’

Posted by venditeravaartha, April 17, 2023

రాజమౌళి యొక్క RRR తో అంతర్జాతీయ స్టార్‌డమ్‌ను సంపాదించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన రాబోయే ‘గేమ్ ఛేంజర్‌’ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ,ఇందులో కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు,పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఇప్పుడు రామ్ చరణ్ మరో డ్యూయల్ సెన్సేషన్ కి రెడీ అవుతున్నాడని ఇన్ సైడ్ టాక్. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారని, డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారని సోర్సెస్ వెల్లడించాయి.

ఈ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, రంగస్థలంలో తన పాత్ర వలె ఈ చిత్రం తన నటనను మరో స్థాయికి ఎలివేట్ చేస్తుందని పంచుకున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లను కథానాయికలుగా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. రామ్ చరణ్ కాలు తెగిన వ్యక్తిగా కనిపించనున్నాడని గతంలో మరో రూమర్ స్ప్రెడ్ అయింది.

201 views