PAWAN KALYAN:షూటింగ్ మొదలైన పవన్ కళ్యాణ్ కొత్త మూవీ

Posted by venditeravaartha, April 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. హైదరాబాద్‌లోని పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ‘భీమ్లా నాయక్’ నటుడు మరియు ఇతర ముఖ్య తారాగణం పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఈ సెట్‌ని నిర్మించారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ యలమంచిలి ,ధమాకా హీరోయిన్ శ్రీ లీల పవన్ కళ్యాణ్ గారికి జంట గా నటించనున్నారు.సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అయితే, ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్. యాక్షన్ సన్నివేశాలకు రామ్-లక్ష్మణ్ జంటగా కొరియోగ్రఫీ చేస్తున్నారు.

560 views