PAWAN KALYAN:పవన్ కళ్యాణ్ విషెస్ మీద ట్రోల్ల్స్ వేస్తున్న మెగా ఫాన్స్

Posted by venditeravaartha, April 22, 2023

సోషల్ మీడియా లో రోజు ఏదో ఒకటి నెటిజన్ల ని ఆకర్షిస్తుంటుంది ,అందులో సినిమా సెలెబ్రెటీ ల కి సంబందించినవి అయితే అదే పని గా వాటి గురుంచి చర్చిస్తుంటారు,అలాంటి ఒక సంఘటన నిన్న జరిగింది,అది ఏంటి అంటే సాయి తేజ్ నటించిన ‘విరూపాక్ష’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సందర్భముగా టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు తేజ్ కి ,సినిమా యూనిట్ కి విషెస్ చెప్పారు,వారి తో పాటు తేజ్ మేన మామ లు అయినా చిరంజీవి గారు ,పవన్ కళ్యాణ్ గారు కూడా తమ విషెస్ ని తెలియపరిచారు.

‘విరూపాక్ష’కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సందర్భంగా సాయి తేజ్‌కి పవన్ కళ్యాణ్ ఫ్లవర్ బొకే పంపారు. అయితే, ట్యాగ్‌పై “డియర్ తేజ్ గారూ, విరూపాక్ష గ్రాండ్ సక్సెస్ అయినందుకు నా హృదయపూర్వక అభినందనలు! శుభాకాంక్షలు, పవన్ కళ్యాణ్” అని రాశారు.సాయి తేజ్‌ని ‘గారూ’ అని సంబోధించిన పవన్ కళ్యాణ్‌ను చాలా మంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సాయి తేజ్ పవన్ మేనల్లుడు మరియు అతని కంటే చాలా సంవత్సరాలు చిన్నవాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న నెటిజన్లు పవన్ కళ్యాణ్ గారు ‘గారూ’ అనే పదాన్ని ఉపయోగించి అతిగా నటించారని ట్రోల్ చేయడం ప్రారంభించారు.అయితే పవన్ కళ్యాణ్ ‘గారు ‘ అని అనడం ఇది మొదటి సారి కాదు వారి ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ,లేక బయట వారు అయినా విషెస్ చెప్పేటప్పుడు కానీ ,లేక ఏదైనా ఫంక్షన్ ల లో కానీ కళ్యాణ్ గారు అందరికి గౌరవం ఇస్తూనే మాట్లాడుతారు.దానికి కోసం పని కట్టుకుని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని కొందరి అభిప్రాయం.

420 views