Krish-Pawan kalyan: హరి హర వీర మల్లు నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్ ! పవన్ కళ్యాణ్ తో విభేదాలే కారణమా ?

Posted by venditeravaartha, May 21, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) వరుసగా చేస్తున్న సినిమా ల లో మొదట గా షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమా ‘హరి హర వీర మల్లు'(Hari hara veera mallu)..డైరెక్టర్ క్రిష్(krish) ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా గా ప్లాన్ చేసారు.పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్ తర్వాత స్టార్ట్ చేసిన వకీల్ సాబ్,భీమ్లా నాయక్ టైం లోనే హరి హర వీర మల్లు సినిమా ని స్టార్ట్ చేసారు.సినిమా షూటింగ్ దాదాపు 70 % పూర్తి అయ్యాక బడ్జెట్ కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి,ఇక అదే సమయం లో పవన్ తన తదుపరి చిత్రాలు అయినా ‘బ్రో’,;ఉస్తాద్ భగత్ సింగ్’,’OG ‘ సినిమా ల ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఇందులో సాయి తేజ్ తో చేస్తున్న ‘బ్రో’ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని జులై 28 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రెండవ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసారు.సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న గ్యాంగ్ స్టార్ ఫిలిం ‘ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్’ కూడా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవలే రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేసారు..ఆ సినిమా ల నుంచి రెగ్యులర్ గా అప్డేట్ లు ఇస్తున్నారు ఆ మూవీ టీం.కానీ రెండు సంవత్సరాల ముందు స్టార్ట్ అయినా హరి హర వీర మల్లు నుంచి మాత్రం ఎటువంటి అప్డేట్ లు లేవు దానికి తోడు పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు కి డేట్స్ కూడా ఇవ్వడం లేదు.

ఎలక్షన్ లు సమీపిస్తున సమయం లో ఇక ఇప్పట్లో హరి హర వీర మల్లు కి డేట్స్ ఇవ్వడం జరిగే పని కాదు అని తెలుస్తుంది.అందువలన ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు అని తెలుస్తుంది.ఒక బాలీవుడ్ స్టార్ తో కొత్త సినిమా చర్చలో ప్రస్తుతం ఉన్నారు క్రిష్..ఈయన ఇది వరకే కంగనా తో బాలీవుడ్ లో ‘మణికర్ణికా’ సినిమా లో పని చేసి ఆమె పెట్టిన కొన్ని షరతులకు ఆ సినిమా నుంచి బయటకి వచ్చేసారు..మరి హరి హర వీర మల్లు కి మరో డైరెక్టర్ ని ఎలా వెతుకుతారో ఆ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం.

1045 views