నాలుగేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ఈ ప్రభుత్వం పట్టించు కోలేదు నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దాడ నుండి జి మామిడాడ వరుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకట రమణ చౌదరి(Boddu venkata ramana chowdary) సంఘీభావ యాత్ర చేపట్టడం జరిగింది. యువగళం 100రోజులు పూర్తిచేసిన నారా లోకేష్(Nara lokesh) కి అభినందనలు తెలియజేసారు ఒక్కఅడుగుతో మొదలై ప్రభుత్వ అడ్డంకులు అధిగమిస్తూ 1200కి.మీ. దాటి ముందుకు సాగుతున్న పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తుకోసం ప్రజా నీరాజనాలతో సాగుతున్న ఈ పాదయాత్రతో జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం తప్పదు అని వెంకట రమణ చౌదరి తెలిపారు .
రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావటం కాయం అని ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారని అని తెలిపారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది అని తెలిపారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు వెంటనే తీర్చే అవకాశం ఉంటుంది అని పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాదయాత్ర చేపట్టారని టీడీపీ కి మంచి రోజులు వస్తున్నాయని బొడ్డు తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ,అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.