AP Politics: వైసీపీ కి జనసేన కంటే తక్కువ సీట్లు రాబోతోందా?..సంచలనం రేపుతున్న ఎన్డీటీవీ సర్వే!

Posted by venditeravaartha, May 30, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

AP Politics: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంత రసాభాసగా జరిగిందో మనమంతా చూసాము. సినిమాల్లో చూసిన విధంగా బాంబులు వేసుకోవడం, కత్తులతో నరుక్కోవడం వంటి ఘటనలు ఎన్నో ప్రత్యక్షంగా చూసాము. ఇప్పటికీ గొడవలు పల్నాడు ప్రాంతం లో జరుగుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున గొడవలు జరగబోతున్నాయి అనే సమాచారం రావడం తో ఎన్నికల సంఘం ఢిల్లీ నుండి ప్రత్యేక బలగాలను ఆంధ్ర లో దింపింది. కౌంటింగ్ సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఎన్నికల సంఘం.

ఇదంతా పక్కన పెడితే ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అధికారం లోకి రాబోతోందా, లేదా వైసీపీ పార్టీ మళ్లీ అధికారం లోకి వస్తుందా అనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. వైసీపీ పార్టీ వారికి ఓడిపోతాము అనే సంకేతాలు అన్నీ సర్వేల ద్వారా వచ్చినప్పటికీ కూడా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 9 న జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని, అందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించారని, ఇలా వైసీపీ పార్టీ క్యాడర్ సోషల్ మీడియా లో చేస్తున్న కామెడీ ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. వాస్తవం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఎన్డీటీవీ అందించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం, సీఎం జగన్ ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఎదురుకోనటువంటి ఘోరమైన పరాజయాన్ని చూస్తాడని, 50 సీట్లు కాదు కదా, కనీసం 20 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదని. కూటమి ప్రభుత్వం కళ్ళు చెదిరే మెజారిటీ తో రాబోతుందని, జనసేన పార్టీ కి వైసీపీ కంటే అత్యధిక సీట్లు వస్తాయని, కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారట.

అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడికి వైసీపీ పార్టీ క్యాడర్ కనుమరుగు అవ్వడం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార మధ అహంకారం తో విర్రవీగి చిందులేస్తే జనాలు కొమ్ములు విరిచేస్తారని గత ఏడాది తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ విషయం లో నిజం చేసి చూపించారు ప్రజలు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి జగన్ విషయం లో జరగబోతుంది అని అంటున్నారు. సీఎం జగన్ ఈసారి ఓడిపోతే వైసీపీ పార్టీ మనుగడ సాగించడం కష్టం. ఎందుకంటే నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ని ప్రతిపక్ష నాయకులూ ఎవ్వరూ కూడా జగన్ ఇబ్బంది పెట్టినట్టు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ మీద కూడా హద్దులు దాటి ప్రవర్తించారు, విమర్శలు చేసారు. కాబట్టి ఈసారి ప్రతీకార చర్యలు ఊహకి అందని విధంగా ఉంటాయని, వైసీపీ పార్టీ ని కూకటి వేళ్ళతో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెకిలించి వేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. మరి అలాంటి పరిస్థితులు వస్తాయో లేదో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

284 views