Akkineni family: ఈ సారి అయినా అక్కినేని ఫ్యామిలీ కి హిట్ దక్కేనా !

Posted by venditeravaartha, July 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు అప్పట్లో నాగేశ్వర రావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారితో పోటా పోటీగా తన క్రేజ్ తో టాప్ లో ఉన్నారు,ఆ తర్వాత నాగార్జున తన తోటి నటులు అయినా చిరంజీవి ,బాలకృష్ణ ,వెంకటేష్ ల తో పోటీగా స్టార్ హీరో గా ఎదిగారు అయితే అతని తర్వాత తరం హీరో లు అయినా నాగ చైతన్య ,అఖిల్ మాత్రం వారి ఫ్యామిలీ లెగసీ ని ముందుకు తీసుకుపోవడం లో తడబడుతూ ఉన్నారు అనే చెప్పాలి.చైతన్య అయినా కొన్ని హిట్ లు చూసిన అఖిల్(Akhil) ఇంత వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా సాధించలేదు.గత కొంత కాలంగా వీరి నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ప్లాప్ గానే నిలుస్తున్నాయి.రీసెంట్ గా కస్టడీ(Custody) మీద ఆశలు పెట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ కి నిరాశే మిగిలింది.

ghost

గత ఏడాది నాగార్జున గారి నుంచి వచ్చిన ది ఘోస్ట్(The Ghost) మూవీ ఆయన కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే,ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది.ఇక ఆ తర్వాత అఖిల్ నుంచి వచ్చిన ఏజెంట్ మూవీ తో అయినా భారీ హిట్ దొరుకుతుంది అని ఆశించిన అక్కినేని ఫ్యామిలీ మరో భారీ ప్లాప్ వచ్చింది సాక్షాత్తు మూవీ ప్రొడ్యూసర్ ఏ సినిమా డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పడం తో ఈ సినిమా ఏ స్థాయి లో ప్లాప్ అయిందో తెలుస్తుంది.ఇక తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన కస్టడీ మూవీ తో అయినా హిట్ దక్కుతుంది అని ఆశించిన వీరికి మరో ప్లాప్ ఏ మిగిలింది.

custody

నాగచైతన్య కి ఇది వరకు ప్రేమమ్ ,సవ్య సాచి లాంటి కమర్షియల్ సినిమా లు ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి తో మరో సారి కలవనున్నారు.ఒక ఫుల్ లెన్త్ కమర్షియల్ సినిమా తో చందు ఈ సారి నాగ చైతన్య పక్క హిట్ అందించనున్నారు అని సమాచారం.బంగారాజు సినిమా తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న అక్కినేని ఫ్యామిలీ ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ కి దూరం అయ్యారు.మరి చందూ సినిమా తో అయినా వీరికి సక్సెస్ వస్తుంది ఏమో చూడాలి.

chandoo

1698 views